Balakrishna : గొప్ప మనసు చాటుకున్న బాలకృష్ణ..

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. కాగా సంక్రాంతి పండగని తన కుటుంబ సభ్యులతో కలిసి నారా వారి పల్లెలో సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు బాలయ్య. ఫ్యామిలీతో పండుగా వేడుకల్లో ఉండి కూడా బాలకృష్ణ చేసిన ఒక పని, తన గొప్ప మనసుని చాటుతుంది.

Balakrishna : గొప్ప మనసు చాటుకున్న బాలకృష్ణ..

balakrishna

Balakrishna : నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. నాలుగు రోజులోనే ఈ సినిమా దాదాపు రూ.104 కోట్ల గ్రాస్ రాబట్టింది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫ్యాక్షన్ డ్రామాకి సిస్టర్ సెంటిమెంట్ ని జత చేసి దర్శకుడు ఒక మేజిక్ క్రియేట్ చేశాడు. దీంతో థియేటర్లో ఆడవారితో పాటు మగవారిని కూడా ఈ సినిమా కంటతడి పెట్టేలా చేస్తుంది. ఇక ఈ సినిమాకి థమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీని మరో లెవెల్ కి తీసుకెళ్లింది.

Veera Simha Reddy : అఖండ తరువాత బాలయ్య ఖాతాలో మరో 100 కోట్ల సినిమా..

కాగా సంక్రాంతి పండగని తన కుటుంబ సభ్యులతో కలిసి నారా వారి పల్లెలో సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు బాలయ్య. ఫ్యామిలీతో పండుగా వేడుకల్లో ఉండి కూడా బాలకృష్ణ చేసిన ఒక పని, తన గొప్ప మనసుని చాటుతుంది. బాలకృష్ణ తన బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతోమంది కాన్సర్ పేషెంట్ లను అందుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కాన్సర్ బాధితురాలిని ఆదుకున్నాడు.

అనంతపూర్ కి చెందిన ఒక ఇంటర్ స్టూడెంట్ గత కొంత కాలంగా బోన్ కాన్సర్ తో బాధ పడుతుంది. చికిత్స చేయడానికి దాదాపు రూ.10 లక్షల పైనే ఖర్చు అవుతుంది అని వైద్యులు తెలియజేశారు. అయితే ఆ బాధితురాలి కుటుంబం దగ్గర అంత ఖర్చు చేసి స్తోమత లేదు. ఈ విషయం కాస్త బాలకృష్ణ వరకు చేరడంతో, బాలయ్య వెంటనే స్పందించించాడు. వెంటనే ఆ కుటుంబంతో ఫోన్ కాల్ ద్వారా పరిస్థితిని తెలుసుకొని, హాస్పిటల్ తరలించే ఏర్పాట్లు చేశాడు బాలయ్య. నిన్ననే ఆమెకు ట్రీట్‌మెంట్ చేయడం కూడా మొదలు పెట్టారు వైద్యులు. ఇక ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ అభిమానులు. మా బాలయ్య బంగారం. జై బాలయ్య అంటూ కామెంట్లు చేస్తున్నారు.