NBK 108 : ఈ సారి మీ ఊహలకు మించి.. ఉగాది స్పెషల్ NBK 108 నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ రిలీజ్..
ఉగాది కానుకగా అప్డేట్ ఇస్తామని చిత్రయూనిట్ మంగళవారం నాడు ప్రకటించారు. తాజాగా నేడు ఉగాది సందర్భంగా NBK 108 సినిమా నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ పై.............

Balakrishna NBK 108 first look released
NBK 108 : బాలకృష్ణ ఇటీవల ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా భారీ హిట్ అయ్యాక అన్‌స్టాపబుల్ షో సూపర్ హిట్ అవ్వడం, ఆ తర్వాత దానికి సీజన్ 2 కూడా తీయడం, ఇటీవల సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో కూడా మళ్ళీ హిట్ కొట్టడం, వరుసగా యాడ్స్ కూడా చేయడం.. ఇలా బాలయ్య బాబు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదే జోష్ లో NBK 108 సినిమా కూడా మొదలుపెట్టారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో NBK 108 సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కామెడీ సినిమాలు తీసే అనిల్ రావిపూడి ఈ సారి కామెడీ కాదంటూ బాలయ్యతో సినిమా తీస్తుండటం, బాలకృష్ణ వరుస విజయాలతో జోరులో ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
DVV Danayya : 2006లో రాజమౌళికి అడ్వాన్స్ ఇస్తే.. ఇప్పుడు RRR తీశాడు.. నిర్మాత దానయ్య వ్యాఖ్యలు..
ఉగాది కానుకగా అప్డేట్ ఇస్తామని చిత్రయూనిట్ మంగళవారం నాడు ప్రకటించారు. తాజాగా నేడు ఉగాది సందర్భంగా NBK 108 సినిమా నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ పై This time beyond your imagination అని పోస్ట్ చేసి ఈ సారి మీ ఊహలకు మించి సినిమా ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఈ పోస్టర్ లో బాలయ్య గంభీరంగా నిల్చొని మెలేసిన మీసంతో మెడలో కండువా చుట్టుకొని ఉన్నారు. మరో పోస్టర్ లో బాలయ్య పవర్ ఫుల్ గా చూస్తున్నట్టు ఉంది. దీంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్య ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు.
Celebrate this UGADI with the Arrival of #NBKLikeNeverBefore 🔥
Presenting the FirstLook of Natasimham #NandamuriBalakrishna from #NBK108 💥
This time,beyond your imagination!@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna pic.twitter.com/i1zP90B0aB
— Shine Screens (@Shine_Screens) March 22, 2023