Balakrishna : దేవబ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పిన బాలయ్య..

ఏపీ, తెలంగాణలోని దేవాంగులు దీనిపై సీరియస్ అయ్యారు. పలువురు నాయకులు బాలకృష్ణని విమర్శించారు, క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తూ రాస్తారోకోలు చేశారు. తాజాగా ఈ వివాదంపై బాలకృష్ణ స్పందిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు...............

Balakrishna : దేవబ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పిన బాలయ్య..

Balakrishna says sorry to devabrahmanas

Balakrishna :  బాలకృష్ణ ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దేవ బ్రాహ్మణులకు గురువు దేవళ మహర్షి అని, వారి నాయకుడు రావణాసురుడు అని దేవాంగుల కులం గురించి పలు వ్యాఖ్యలు చేయగా.. దీనిని వ్యతిరేకిస్తూ దేవబ్రాహ్మణులు కామెంట్స్ చేశారు. చరిత్ర పూర్తిగా తెలుసుకోకుండా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దేవాంగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి అంటూ వ్యాఖ్యానిస్తూ బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏపీ, తెలంగాణలోని దేవాంగులు దీనిపై సీరియస్ అయ్యారు. పలువురు నాయకులు బాలకృష్ణని విమర్శించారు, క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తూ రాస్తారోకోలు చేశారు. తాజాగా ఈ వివాదంపై బాలకృష్ణ స్పందిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Rajamouli : RRR బాలీవుడ్ సినిమా కాదు, తెలుగు సినిమా.. అమెరికాలో గర్వంగా చెప్పిన రాజమౌళి..

ఈ ప్రెస్ నోట్ లో.. దేవబ్రాహ్మణ సోదరసోదరీమణులకు మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ మనఃపూర్వక మనవి. దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పు అని నాకు తెలియజెప్పిన దేవబ్రాహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదు, ఉండదని కూడా తెలుగు ప్రజలందరికీ తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే. అంతేకానీ సాటిసోదరుల మనసు గాయపరచటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి. పైగా దేవాంగులలో నా అభిమానులు చాలామంది ఉన్నారు, నావాళ్లను నేను బాధపెట్టుకుంటానా?. అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను.. ఇట్లు మీ బాలకృష్ణ అని రాశారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.