Bangarraju: శృతి మించిన బడ్జెట్.. సీక్వెల్ హిట్‌పైనే నాగ్ ఆశలన్నీ!

అక్కినేని హీరోలు ఈసారి జబర్దస్తీ ఎంటర్ టైనర్ తో వచ్చేందుకు సిద్ధమయ్యారు. నాగ్ ఐదేళ్ల క్రితం సోగ్గాడే చిన్నినాయన సినిమా ఇప్పటికీ టీవీలలో మంచి ఆదరణ దక్కించుకుంటుంది.

Bangarraju: శృతి మించిన బడ్జెట్.. సీక్వెల్ హిట్‌పైనే నాగ్ ఆశలన్నీ!

Bangarraju

Bangarraju: అక్కినేని హీరోలు ఈసారి జబర్దస్తీ ఎంటర్ టైనర్ తో వచ్చేందుకు సిద్ధమయ్యారు. నాగ్ ఐదేళ్ల క్రితం సోగ్గాడే చిన్నినాయన సినిమా ఇప్పటికీ టీవీలలో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. నాగ్ డబుల్ రోల్ లో రొమాంటిక్ యాంగిల్ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసాడు. ఆ సినిమా విడుదలైన సమయంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రకటించి ఇప్పుడు అదే మాటతో సీక్వెల్ తో వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ మంచి అప్లాజ్ దక్కించుకుంది.

Sneha Ullal: ఉల్లాల ఉల్లాల.. ఉత్సాహంగా జూనియర్ ఐష్

సోగ్గాడే చిన్నినాయన సినిమాలో రెండు పాత్రలు నాగ్ చేయగా సీక్వెల్ బంగార్రాజు సినిమాలో భారీ క్యాస్టింగ్ తోడైంది. నాగ్ రమ్యకృష్ణలకు తోడుగా నాగ చైతన్య, కృతి శెట్టిలను కూడా తీసుకున్న మేకర్స్ ఆ పాత్రల నిడివిని కూడా పెంచి దీన్నో మల్టీస్టారర్ సినిమాగా సిద్ధం చేశారు. అయితే.. ఇప్పుడు ఈ సినిమాపై ఓ ఆసక్తికర గాసిప్ ఒకటి సినీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. అదే ఈ సినిమా బడ్జెట్ శృతి మించిపోయిందట. అందుకే సినిమాపై అక్కినేని అండ్ కో కాస్త టెన్షన్ లో ఉందని టాక్ నడుస్తుంది.

Bigg Boss 5: షన్నుకి హింట్ ఇచ్చిన దీప్తి.. బాబోయ్ ఇంత ఇంటెలిజెంటా?

కరోనాకు ముందే కొంత షూటింగ్.. కరోనా తర్వాత మళ్ళీ కాల్షీట్స్ అడ్జెస్ట్ మెంట్.. టెక్నీషియన్స్ పేమెంట్స్.. అన్నపూర్ణలో వేసిన సెట్, అనుకున్న దానికన్నా సినిమా విషయంలో కాంప్రమైజ్ కాకపోవడం వంటి కారణాలతో సినిమా బడ్జెట్ యాభైకోట్లకు చేరువయిందట. అయితే.. శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ భారీగా పలుకుతున్న ఈ రోజుల్లో ఈ బడ్జెట్ రాబట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదని వినిపిస్తుండగా నాగ్ అండ్ కో దానిపైనే ఆశలు పెట్టుకొని సినిమాని హైరేంజ్ లో సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.