Bangarraju : ‘బంగార్రాజు’ స్టార్ట్ అయ్యాడు.. ఆనందంలో అక్కినేని అభిమానులు..

‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్‌.. ‘బంగార్రాజు’ మూవీని శ్రావణ శుక్రవారం పర్వదినాన పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు..

Bangarraju : ‘బంగార్రాజు’ స్టార్ట్ అయ్యాడు.. ఆనందంలో అక్కినేని అభిమానులు..

Bangarraju: అక్కినేని హీరోలు సూపర్ స్పీడ్ మీద ఉన్నారు. ఇటీవల ‘వైల్డ్ డాగ్’ తో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కింగ్’ నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. మరోవైపు ‘బిగ్ బాస్ 5’ కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ‘బోర్‌డమ్‌కి చెప్పండి గుడ్ బై.. వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ అంటూ మరోసారి స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యబోతున్నారు.

Bigg Boss 5 : ‘బోర్‌డమ్‌కి గుడ్‌బై.. వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్’..

ఇక యువసామ్రాట్ నాగ చైతన్య కూడా వరుసగా సినిమాలు లైనప్ చేస్తున్నారు. ‘లవ్ స్టోరీ’ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో చేస్తున్న ‘థ్యాంక్యూ’, బాలీవుడ్ ఎంట్రీ ‘లాల్ సింగ్ చద్దా’ సెట్స్ మీద ఉన్నాయి. ఇప్పుడు ‘కింగ్’, ‘యువసామ్రాట్’ కలిసి నటిస్తున్న సినిమా స్టార్ట్ చేసి అక్కినేని అభిమానుల్లో ఆనందాన్ని నింపారు.

Chai – Sam : క్యూట్ కపుల్ కల నెరవేరింది..

‘సోగ్గాడే చిన్నినాయనా’ కి ప్రీక్వెల్‌గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బంగార్రాజు’ మూవీని శ్రావణ శుక్రవారం పర్వదినాన పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నాగ్, చై, నాగ సుశీల, సీనియర్ రైటర్ సత్యానంద్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, హీరోయిన్ కృతి శెట్టి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, 2022 సమ్మర్‌లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Bangarraju Launched