బెల్లంకొండ, సంతోష్ శ్రీనివాస్ సినిమా ప్రారంభం

బెల్లకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్ జంటగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

  • Published By: sekhar ,Published On : November 29, 2019 / 05:53 AM IST
బెల్లంకొండ, సంతోష్ శ్రీనివాస్ సినిమా ప్రారంభం

బెల్లకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్ జంటగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

బెల్లకొండ సాయి శ్రీనివాస్, ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ నభా నటేష్ జంటగా..`కందిరీగ`, `రభస` సినిమాలను తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

 

Image

హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా, జెమిని కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్తగా ఎయిట్ ప్యాక్‌లో కనిపించనున్నాడు.

Image

సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ సంస్థ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, కెమెరా : డూడ్లీ రాజ్, ఆర్ట్ : అవినాష్ కొల్ల.
Image