Navya Naveli Nanda : మహిళల ఆరోగ్యం కోసం బిగ్ బి మనవరాలు..

బిగ్ బి అమితాబ్ కుటుంబమంతా సినిమా పరిశ్రమే. కానీ ఆ కుటుంబం నుంచి ఒక్కరు మాత్రం సినిమా వద్దని మహిళల ఆరోగ్యం కోసం పాటు పడుతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ కూతురి కూతురు, బిగ్ బి మనవరాలు నవ్య నవేలి............

Navya Naveli Nanda : మహిళల ఆరోగ్యం కోసం బిగ్ బి మనవరాలు..

Navya Naveli

Navya Naveli Nanda :  బిగ్ బి అమితాబ్ కుటుంబమంతా సినిమా పరిశ్రమే. కానీ ఆ కుటుంబం నుంచి ఒక్కరు మాత్రం సినిమా వద్దని మహిళల ఆరోగ్యం కోసం పాటు పడుతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ కూతురి కూతురు, బిగ్ బి మనవరాలు నవ్య నవేలి నంద ఇంటి నిండా సినిమా వాళ్ళు ఉన్నా తనకు సినిమా వద్దని సమాజంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ తెచ్చుకోవాలని ట్రై చేస్తుంది. తనలాంటి మరో ముగ్గురు యంగ్ ఉమెన్స్ తో కలిసి మహిళల ఆరోగ్యం కోసం ‘ఆరా హెల్త్‌’ అనే సంస్థను స్థాపించింది.

 

తాజాగా హైదరాబాద్‌లో న్యారి సంస్థ నిర్వహించిన యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ కార్యక్రమంలో నవ్య మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. ఈ కార్యక్రమంలో నవ్య మాట్లాడుతూ.. ”ఇంట్లో మొత్తం సినిమా వాతావరణమే ఉన్నా కానీ నాకు సినిమాలు అంతగా ఇంట్రెస్ట్ లేదు. మనకు నచ్చిన పనినే కెరీర్‌గా ఎంచుకుంటే భవిష్యత్తు సంతృప్తిగా ఉంటుంది. నేను మహిళల హక్కులు, సాధికారత గురించి ఆలోచిస్తాను. అందుకే ఈ కఫీర్ ని ఎంచుకున్నాను. ఒక మహిళగా తోటి మహిళలకు అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది. అందుకే మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం మరో ముగ్గురితో కలిసి ‘ఆరా హెల్త్‌’ సంస్థను స్థాపించాను.”

Amitabh Bachchan: ప్రాజెక్ట్ Kలో బిగ్ బి పాత్ర ఇదేనా?

”సాధారణంగా మహిళలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ. కానీ చాలామంది వాటి గురించి మాట్లాడటానికి భయపడతారు. మహిళలకు వారి శరీరం పట్ల అవగాహన కల్పించి, సరైన పరిష్కార మార్గాన్ని చూపడం, తగిన ఉత్పత్తుల్ని అందించడమే మా సంస్థ లక్ష్యం. ‘ఆరా హెల్త్‌’ను స్థాపించి రెండు ఏళ్ళు పైనే అవుతుంది. ఇప్పటి వరకు దాదాపు 70 వేలమంది మహిళలు మా సంస్థలో భాగస్వాములు అయ్యారు. మహిళలకు ఉచిత న్యాయ సలహాలు, కౌన్సెలింగ్‌ ఇచ్చే న్యారీతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నా దృష్టిలో మహిళా సాధికారత అంటే ఒత్తిడి లేకుండా నచ్చిన పని చేసుకుంటూ ఆనందంగా ఉండటమే. నేను ఒక కంపెనీ సీయీవోలానే కాక భార్యగా, గృహిణిగా, తల్లిగా కూడా ఆలోచిస్తాను. అందుకే మహిళలు తమకు నచ్చిన కెరీర్‌లో నచ్చిన విధంగా జీవించేందుకు ప్రోత్సహిస్తాను. హైదరాబాద్‌కు మొదటి సారి వచ్చాను. త్వరలో మళ్ళీ వస్తాను” అని తెలిపింది.

స్టార్ హీరో మనవరాలు, వ్యాపారవేత్త కూతురు అయినా తనకంటూ సొంతంగా నిలబడాలని ఇలా మహిళల కోసం కష్టపడుతుండటంతో నవ్య నవేలిని అందరూ అభినందిస్తున్నారు.