Bigg Boss Telugu 4 Highlights : కంటెస్టెంట్స్‌లకు చిరు సూచనలు

Bigg Boss Telugu 4 Highlights : కంటెస్టెంట్స్‌లకు చిరు సూచనలు

Bigg Boss – 4 : ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఇద్దరు స్టార్‌ హీరోల మధ్య..బిగ్‌బాస్‌ ఫినాలే షో వైభవంగా ముగిసింది. అందరూ ఊహించినట్లుగానే బిగ్‌బాస్‌-4 టైటిల్‌ కైవసం చేసుకున్నాడు అభిజిత్‌. ఇక…బిగ్‌బాస్‌-4 టైటిల్‌ కోసం గట్టి పోటి ఇచ్చిన అఖిల్ ర‌న్నర‌ప్‌తో స‌రిపెట్టుకున్నాడు. అంగరంగ వైభవంగా మొదలైన బిగ్‌బాస్..ఏ మాత్రం తీసిపోకుండా చివరి వరకూ అదే అంచనాలతో ఉత్కంఠ భరితంగా సాగింది. హోస్ట్‌గా నాగార్జున సక్సెస్‌ఫుల్‌గా మరో సీజన్ ముగించగా…ప్రైజ్ మనీ, ట్రోఫీని అందించడానికి మెగాస్టార్ చిరంజీవి…బిగ్‌బాస్ 4 స్టేజీ మీదకు రావడం హైలెట్‌గా నిలిచింది.

ఆద్యంతం ఉత్కంఠ :-
ఈ షో ఫినాలే ఆదివారం సినీ తారల సందడి మధ్య ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. దాదాపు మూడు నాలుగు వారాలుగా సోషల్ మీడియాతో పాటు బిగ్‌బాస్‌ అభిమానులు అంచనా వేస్తున్నట్లే అభిజిత్ విజేతగా నిలిచాడు. బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాగార్జున విన్నర్‌ను ప్రకటించగా..ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి సీజన్‌-4 విజేత అభిజిత్‌కు ట్రోఫీతో పాటు నగదు బహుమతిని అందించారు. అలాగే స్టైలిష్ బైక్‌ను సైతం సొంతం చేసుకున్నాడు అభిజిత్‌.

సంతోషంలో అభిజిత్ :-
ఇద్దరు స్టార్ హీరోల చేతుల మీదుగా ట్రోఫీని అందుకున్నందుకు అభిజిత్‌ సంతోషంలో మునిగితేలాడు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఓట్లేసిన ప్రేక్షకుల‌కు పాదాభివందనాలు చేశాడు. త‌ను కంటెస్టెంట్ కావ‌డం బిగ్‌బాస్‌కు గ‌ర్వకార‌ణ‌మ‌న్నార‌ని…,కానీ బిగ్‌బాస్ షోనే త‌న‌కు గ‌ర్వకార‌ణ‌మ‌ని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ మిస్టర్ ప‌ర్‌ఫెక్ట్‌ బిగ్‌బాస్ ఇంటికి మ‌హానాయ‌కుడిన‌య్యాన‌ని స‌గ‌ర్వంగా ప్రక‌టించాడు అభిజిత్‌. అభిజిత్‌ గెలుపుతో అతడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

రన్నరప్ అఖిల్ :-
అభిజిత్‌తో పాటు బిగ్‌బాస్‌ సభ్యులందరూ…మున్ముందు ఉన్నతస్థానానికి ఎదగాలంటూ దివించాలని…నాగార్జున, చిరంజీవిని కోరింది అభిజిత్‌ మదర్‌. ఇక ఇక్కడ వరకూ రావడమే సంతోషంగా ఉందని అన్నారు రన్నరప్‌గా నిలిచిన అఖిల్. మెగాస్టార్ లాంటి వ్యక్తి పక్కన నిల్చోవడమే తనకు గెలుపు అని చెప్పాడు. ఈ రోజును తన జీవితంలో మార్చిపోలేనంటూ చెప్పుకొచ్చాడు.

అద్భుత వేదిక బిగ్ బాస్ :-
వ్యక్తిత్వ వికాసానికి ఈ బిగ్‌బాస్‌ స్టేజ్‌…అద్భుతమైన వేదికన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ బిగ్‌బాస్‌ షో…గ్లామర్‌ పెంచుతూ…సెలబ్రెటీలను చేస్తుందని…జీవితాంతం ఈ బిగ్‌బాస్‌కు మనమంతా రుణపడి ఉండాలని అన్నారు. ఇక్కడ నేర్చుకున్న పాఠాలు…ఇక్కడే వదిలేయకుండా…నిరంతరం గుండెలో పెట్టుకోవాలని..జీవితాలను సక్రమైన మార్గంలో నడిపించుకోవాలని సూచించారు మెగాస్టార్‌ చిరంజీవి. ఇక చివరిగా బిగ్‌బాస్‌ 4 సీజన్‌కు సైనింగ్‌ ఆప్‌ చెప్పారు…బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాగార్జున.