Shakila : బిగ్‌బాస్ సీజన్ 7లో ఆరవ కంటెస్టెంట్.. షకీలా.. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఊపేసి.. తర్వాత సినిమాలకు దూరమయి..

షకీలా.. ఈ పేరు తెలియని వారు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో తెలియని వారు ఉండరు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన షకీలా ఆ తర్వాత బోల్డ్ క్యారెక్టర్స్, వ్యాంప్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది.

Shakila : బిగ్‌బాస్ సీజన్ 7లో ఆరవ కంటెస్టెంట్.. షకీలా.. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఊపేసి.. తర్వాత సినిమాలకు దూరమయి..

Bigg Boss Season 7 sixth contestant Shakila life story and movies details re entry in telugu with Bigg Boss

Shakila :  తెలుగు పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 నిన్న సెప్టెంబర్ 3 ఆదివారం నాడు గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో, సెలబ్రిటీ గెస్ట్ లతో గ్రాండ్ గా మొదలైంది. ఇవాల్టినుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ షో స్టార్ మా (Star Maa) ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నిప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో 24 గంటలు లైవ్ స్ట్రీమ్ కానుంది.

ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో ఆరవ కంటెస్టెంట్ గా షకీలా(Shakila) ఎంట్రీ ఇచ్చింది. షకీలా బిగ్ బాస్ ఎంట్రీ అందర్నీ ఆశ్చర్యపరిచింది.

షకీలా.. ఈ పేరు తెలియని వారు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో తెలియని వారు ఉండరు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన షకీలా ఆ తర్వాత బోల్డ్ క్యారెక్టర్స్, వ్యాంప్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం తనే హీరోయిన్ గా అనేక బి గ్రేడ్ సినిమాల్లో నటించింది. బి గ్రేడ్ సినిమాలతో అబ్బాయిల్లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. షకీలా తెలుగమ్మాయి అయినా మలయాళంలో స్టార్ గా ఎదిగింది. తమిళ్ లో కూడా ఎక్కువ సినిమాలు చేసింది. ఒకప్పుడు షకీలా సినిమా వస్తుందంటే మలయాళంలో స్టార్ హీరోలు కూడా తమ సినిమాలని వాయిదా వేసుకునేవారు. కానీ ఏజ్ పెరిగిన తర్వాత బి గ్రేడ్ సినిమాలు చేయడం తగ్గించి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం మొదలుపెట్టింది. తన బంధువులే డబ్బుల విషయంలో తనని మోసం చేయడంతో ఎంత స్టార్ డమ్ వచ్చినా, డబ్బులు సంపాదించినా సరిగ్గా సెటిల్ అవ్వలేకపోయింది.

Subhashree Rayaguru : బిగ్‌బాస్ సీజన్ 7లో ఐదవ కంటెస్టెంట్.. శుభశ్రీ రాయగురు.. మోడల్ నుంచి హీరోయిన్ గా..

కొన్నాళ్ళు సినిమాలకు పూర్తిగా దూరమైన షకీలా ప్రస్తుతం తమిళ్ లో ఓ షో చేస్తూ, ఇంటర్వ్యూలు ఇస్తూ, పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వస్తే చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం బోల్డ్ క్యారెక్టర్స్ కి చాలా దూరంగా ఉంటుంది. అలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ కొంతమంది ట్రాన్స్ జెండర్స్, అనాథల బాగోగులు చూసుకుంటుంది. ఒకప్పుడు బి గ్రేడ్ స్టార్ గా ఎదిగిన షకీలా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో పద్దతిగా చేసుకుంటూ వస్తుంది. తెలుగులో ఇలా చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ తో ఎంట్రీ ఇచ్చింది. మరి బిగ్ బాస్ లో షకీలా ఎలా ఆడుతుందో, ఎలా ఉంటుందో చూడాలి. షకీలా ఎంట్రీతో ఈ సారి బిగ్ బాస్ కి మరింత హైప్ వచ్చింది.