BiggBoss Non Stop : బిగ్‌బాస్‌ చరిత్రలోనే మొదటి సారి.. ఈ వారం నామినేషన్స్ లో 12 మంది..

తాజాగా త్వరలో హోలీ పండగ ఉండటంతో మూడోవారం నామినేషన్స్ ఎపిసోడ్‌ మరింత ఆసక్తికరంగా సాగింది. ఈ సారి కంటెస్టెంట్లకు ‘కొట్టు కొట్టు కొట్టు రంగుతీసి కొట్టు’ అని టాస్క్‌ ఇచ్చారు..........

BiggBoss Non Stop :  బిగ్‌బాస్‌ చరిత్రలోనే మొదటి సారి.. ఈ వారం నామినేషన్స్ లో 12 మంది..

Biggboss

BiggBoss Non Stop :  బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఈ సారి ఓటీటీ వేదికగా నాన్‌స్టాప్‌ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పటికే బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ మొదలయి రెండు వారాలు పూర్తి చేసుకుంది. 17 మందితో ఈ షో ప్రారంభం కాగా రెండు వారాల్లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ముమైత్‌ఖాన్‌, శ్రీరాపాక ఇప్పటికే హౌస్‌ నుంచి వెళ్లిపోయారు. దీంతో హౌస్ లో 15 మంది మాత్రమే మిగిలారు. ఇక ఎప్పటిలాగే గేమ్ వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ అన్నట్టు సాగుతుంది.

తాజాగా త్వరలో హోలీ పండగ ఉండటంతో మూడోవారం నామినేషన్స్ ఎపిసోడ్‌ మరింత ఆసక్తికరంగా సాగింది. ఈ సారి కంటెస్టెంట్లకు ‘కొట్టు కొట్టు కొట్టు రంగుతీసి కొట్టు’ అని టాస్క్‌ ఇచ్చారు. ఈ టాస్క్ తో నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఇద్దరిని చెప్పున నామినేట్ చేస్తూ వాళ్లపై రంగు కొట్టాలి.

తేజస్వితో ఈ నామినేషన్‌ టాస్క్‌ మొదలైంది. తేజస్వి అరియానాని, చైతూను నామినేట్ చేసింది.

స్రవంతి.. హమీద, మిత్రా శర్మని నామినేట్ చేసింది.

ఆర్జే చైతు.. తేజస్విని, మిత్రా శర్మని నామినేట్ చేశాడు.

మహేష్ విట్టా.. అజయ్‌, నటరాజ్ మాస్టర్‌ని నామినేట్ చేశారు.

అషురెడ్డి.. మహేష్ విట్టా, మిత్రా శర్మలను నామినేట్ చేశారు.

యాంకర్‌ శివ.. నటరాజ్ మాస్టర్‌ని, అఖిల్‌ని నామినేట్ చేశాడు.

బిందు మాధవి.. తేజస్విని, అఖిల్‌ని నామినేట్‌ చేసింది.

హమీదా.. స్రవంతిని, అజయ్‌ని నామినేట్ చేసింది.

అజయ్‌.. మహేష్ విట్టాని, నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేశాడు.

నటరాజ్ మాస్టర్.. యాంకర్ శివని, బిందు మాధవిని నామినేట్ చేశాడు.

ఇక సరయు.. స్రవంతి, అజయ్‌లను నామినేట్ చేసింది.

అనిల్.. మహేష్‌ విట్టా, మిత్రా శర్మలను నామినేట్ చేశాడు.

అరియానా.. తేజస్వి, మిత్రా శర్మలను నామినేట్‌ చేసింది.

మిత్రా శర్మ.. యాంకర్ శివ, ఆర్జే చైతూని నామినేట్ చేసింది.

అఖిల్.. యాంకర్ శివ, ఆర్జే చైతులను నామినేట్ చేశాడు.

BiggBoss Non Stop : మళ్ళీ కొట్టుకున్న బిగ్‌బాస్‌ సభ్యులు.. సరయు, శ్రీరాపాక ఒకరిపై ఒకరు పడిపోయి..

దీంతో ఎక్కువ నామినేషన్స్ పడ్డ వారందరిని నామినేషన్స్ లో ఉంచారు. హౌస్ లో ఇంకా 15 మంది మిగిలి ఉండగా అందులో అనిల్, సరయు, అషూరెడ్డి తప్పితే మిగిలిన 12 మంది ఈ వారం నామినేషన్‌ ప్రక్రియలో నిలవడం విశేషం. ఒకేసారి ఇంతమంది నామినేట్ కావడం ఈ సీజన్‌లోనే కాకుండా తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే మొదటిసారి. మరి ఇంతమని నామినేషన్స్ లో ఉండగా మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అని మరింత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.