BIGGBOSS4 Telugu: స్వాతి దీక్షిత్ అందరి గురించి చెప్పేసింది

BIGGBOSS4 Telugu: స్వాతి దీక్షిత్ అందరి గురించి చెప్పేసింది

BIGGBOSS4 Teluguలో గతంలో ఎప్పుడూ లేని విధంగా సేవ్ చేయడం లేకుండా డైరక్ట్‌గా ఎలిమినేషన్ చేసేశారు. గన్ పేల్చుకుని ట్రిగ్గర్ సౌండ్ అయితే నో ప్రాబ్లమ్.. దాంతో పాటు బుల్లెట్ ఫైర్ సౌండ్ అయితే మాత్రం ఎలిమినేషన్ అని కింగ్ నాగర్జున చెప్పారు. స్వాతి దీక్షిత్ కాల్చుకున్నప్పుడు అదే సౌండ్ రావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు. ఇదంతా శనివారం ఎపిసోడ్ సంగతి.

మరి శనివారం ఎపిసోడ్ తర్వాత ఆదివారం స్టేజిపైకి వచ్చిన స్వాతి దీక్షిత్ ను నాగ్.. ఎక్కడ ఫెయిల్ అయ్యావ్ అని అడిగితే ఆల్రెడీ టీంలు అయిపోయారని తనని ఎవరూ కలుపుకోలేదని వెయిట్ చేస్తూ ఉండిపోయానని చెప్పింది. ఆ తర్వాత హౌజ్ లో మెంబర్స్ క్యారెక్టర్ల గురించి చెప్పేలా ఓ గేమ్ ఆడించారు.



అందులో అవినాశ్ తన ఫేవరేట్ అని చెప్పిన స్వాతి.. ఎలిమినేషన్ కు నామినేట్ చేసిన అమ్మ రాజశేఖర్ గురించి పెద్ద కామెంటే చేసింది అన్నం పెట్టిన వారినే మోసం చేసే నమ్మక ద్రోహి అని తిట్టిపోసింది. ఇక మిగతా క్యారెక్టర్ల గురించి ఇలా చెప్పింది.

కుమార్‌ సాయి – న‌క్క తోక తొక్కిన వ్య‌క్తి
అతడు చాలా టాలెంటెడ్. కానీ వెనుక నుంచి ఎవరైనా తోస్తే తప్ప తన టాలెంట్‌ని బయట పెట్టరు



అమ్మ రాజ‌శేఖర్ – నమ్మక ద్రోహి
సుజాత‌ – పుకార్ల పుట్ట‌
సోహైల్‌ – దొంగ‌
లాస్య‌ – అవ‌కాశ‌వాది
నోయ‌ల్‌ – గుడ్డిగా న‌మ్మే వాడు
మోనాల్‌ – ఏమార్చే వ్య‌క్తి
మెహ‌బూబ్‌ – ఫాలోవర్
అరియానా – ఓవ‌ర్ కాన్ఫిడెన్స్
హారిక – ట్యూబ్‌లైట్
అభిజిత్ – అహంకారి‌
గంగ‌వ్వ‌ – చాడీల చిట్టా
అఖిల్ – గ‌మ్యం లేని వ్య‌క్తి

అమ్మ రాజశేఖర్ పై చాలా నెగిటివ్ ఫీలింగ్ పెంచుకున్న స్వాతి.. అతను కెప్టెన్సీ రేసులో పాల్గొనడానికి వీల్లేదంటూ బిగ్‌బాంబ్ వేశారు.