Bimbisara Rap Song: బింబిసార ర్యాప్ సాంగ్.. మామూలుగా లేదుగా!

కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఫాంటెసీ థ్రిల్లర్ మూవీ ‘బింబిసార’ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇప్పటికే ఈ సినిమా పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుండగా, తాజాగా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది బింబిసార చిత్ర యూనిట్.

Bimbisara Rap Song: బింబిసార ర్యాప్ సాంగ్.. మామూలుగా లేదుగా!

Bimbisara Rap Song: కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఫాంటెసీ థ్రిల్లర్ మూవీ ‘బింబిసార’ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమాలో బింబిసార అనే పవర్‌ఫుల్ పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించగా, ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను అందుకుందంటే, ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో మనం అర్ధం చేసుకోవచ్చు.

Bimbisara: బింబిసార ఓటీటీ రిలీజ్.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

ఈ సినిమాకు కథ, కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో మేజర్ అసెట్‌లుగా నిలవగా.. చిరంతన్ భట్ సాంగ్స్, ఎంఎం.కీరవాణి బీజీఎంలు మరో మేజర్ ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. కాగా, ఇప్పటికే ఈ సినిమా పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుండగా, తాజాగా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది బింబిసార చిత్ర యూనిట్. ఈ సినిమా నుండి ఓ ర్యాప్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ర్యాప్ వర్షన్‌తో ఈ పాట రాగా, ఇందులో సినిమాలో పలు కీలక సన్నివేశాలను మనకు చూపించారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యుయెల్ రోల్ అనే విషయాన్ని కూడా ఈ పాటలో రివీల్ చేశారు.

Bimbisara: బింబిసార కళ్యాణ్ రామ్ కాదా.. మరెవరు?

అంతేగాక, కళ్యాణ్ రామ్ నోటి నుండి వచ్చిన కొన్ని పవర్‌ఫుల్ డైలాగులు కూడా ఈ ర్యాప్ వర్షన్‌లో మిక్స్ చేశారు. లిప్సికా, ఆదిత్య ఐయెంగర్, పృథ్వీ చంద్ర ఈ ర్యాప్ వర్షన్‌ను పాడగా, కీరవాణి ఈ పాటకు సంగీతం అందించాడు. ఇక ఈ ర్యాప్ వర్షన్ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది.