Bollywood : బ్రహ్మస్త్ర పార్ట్ 1 రిలీజ్ కాలేదు.. అప్పుడే పార్ట్ 2,3 గురించి చర్చలు..

పాన్ ఇండియా లెవల్ సినిమా కోసం వెయిట్ చేసిన బాలీవుడ్ ఆడియన్స్ కు పవర్ ఫుల్ ట్రయిలర్ తో ఆశ్చర్యపరిచారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ట్రయిలరే ఊహించని రేంజ్ లో భారీ స్థాయి గ్రాఫిక్స్ తో, విజవల్ వండర్...........

Bollywood : బ్రహ్మస్త్ర పార్ట్ 1 రిలీజ్ కాలేదు.. అప్పుడే పార్ట్ 2,3 గురించి చర్చలు..

Brahmastra

Brahmastra :  రణబీర్ కపూర్, ఆలియాభట్, అమితాబ్, నాగార్జున, మౌనిరాయ్…. ఇది బ్రహ్మాస్త్ర పార్ట్ 1 స్టార్ క్యాస్ట్. మరి సెకండ్ పార్ట్ లో ఎవరు ఉంటారు అని బ్రహ్మాస్త్ర రిలీజ్ కాకుండానే సెకండ్ పార్ట్ లోని ఆర్టిస్ట్ ల పైన పెద్ద చర్చే నడుస్తోంది. ఇటీవలే బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ ట్రయిలర్ వచ్చేసింది. పాన్ ఇండియా ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. వరల్డ్
వైడ్ సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేయనున్నారు. మూడు పార్టులుగా రిలీజ్ కానుంది ఈ సినిమా. పార్ట్ వన్ శివలో రణబీర్ కపూర్, ఆలియాభట్, అమితాబ్, మౌనిరాయ్, నాగార్జున తో పాటు, డింపుల్ కపాడియా తో పాటు షారూక్ ఖాన్ కూడా ఓ సైంటిస్ట్ రోల్ లో గెస్ట్ అప్పీరెన్స్ గా కనిపించనున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటి నుంచే పార్ట్ 2, 3 కోసం ఆర్టిస్టులు ఎవరైతే బాగుంటుందనే చర్చ బాలీవుడ్లో హాట్ హాట్ గా నడుస్తుంది.

Sadha : మేజర్ సినిమా చూసి ఏడ్చేసిన సదా.. ఆ సమయంలో ముంబైలోనే ఉన్నాను..

పాన్ ఇండియా లెవల్ సినిమా కోసం వెయిట్ చేసిన బాలీవుడ్ ఆడియన్స్ కు పవర్ ఫుల్ ట్రయిలర్ తో ఆశ్చర్యపరిచారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ట్రయిలరే ఊహించని రేంజ్ లో భారీ స్థాయి గ్రాఫిక్స్ తో, విజవల్ వండర్ అనిపిస్తుండటంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. దాంతో పార్ట్ 2,3 లో రణబీర్, ఆలియా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ తో పాటు షారూఖ్ ను సేమ్ రోల్ కి కంటిన్యూ చేస్తూ, దీపికా పడుకోన్, హృతిక్ రోషన్, విద్యాబాలన్ ను ఇతర క్యారెక్టర్స్ లో తీసుకుంటే బాగుంటుందని బాలీవుడ్ ఆడియన్స్ సజెస్ట్ చేస్తున్నారు.

ఇంకా ఈ పార్ట్ వన్ ట్రయిలర్ ను మార్వెల్, డిసి సినిమాలతో పోల్చుతున్నారు హిందీ ప్రేక్షకులు. ఎన్నో వాయిదాల తర్వాత రెండు పాండమిక్ సిచ్యుయేషన్స్ ను ఎదుర్కొని ఎట్టకేలకు బ్రహ్మాస్త్ర్ పార్ట్ వన్ శివ కంప్లీట్ చేశారు అయాన్ ముఖర్జీ. బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ రిలీజ్ కోసం ఎంత ఎదురుచూస్తున్నారో పార్ట్ 2, పార్ట్ 3లో క్యాస్టింగ్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారా అని కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బాలీవుడ్ మూవీ లవర్స్.