Bollywood Hero’s: 30@ఇండస్ట్రీ.. మూడు స్టెప్పులు దాటేసిన బాలీవుడ్ హీరోలు!

బాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలంతా 30 ఇయర్ ఇండస్ట్రీ పాట పాడుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసి.. స్టార్ ఇమేజ్ సాధించిన హీరోలు.. సక్సెస్ ఫుల్ గా మూడు పదుల..

10TV Telugu News

Bollywood Hero’s: బాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలంతా 30 ఇయర్ ఇండస్ట్రీ పాట పాడుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసి.. స్టార్ ఇమేజ్ సాధించిన హీరోలు.. సక్సెస్ ఫుల్ గా మూడు పదుల కెరీర్ ను క్రాస్ చేశారు. రీసెంట్ గా అజయ్ దేవ్ గన్, అంతకు ముందు అక్షయ్ కుమార్.. ఖాన్ త్రయం కూడా 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.

Telugu Heroin’s: ఎక్కడ ఆఫర్ వస్తే.. అక్కడ వాలిపోతున్న హీరోయిన్లు!

30 ఇయర్ ఫిల్మ్ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్. ఒక స్టంట్ మెన్ వారసుడిగా ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన అజయ్.. ఊహించని విధంగా హీరో అయ్యి.. ఆతరువాత తన టాలెంట్ తో స్టార్ హీరో స్టేటస్ సాధించాడు. పూల్ హౌర్ కాంటే మూవీతో 1991లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అజయ్.. ఆతరువాత జఖ్మ్‌, ఇష్క్‌, దిల్జాలే, హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌, ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌, యువ, ఓంకార, సింగం, బోల్‌ బచ్చన్‌ లాంటి సినిమాలతో స్టార్ స్టేటస్ సాధించాడు. బాలీవుడ్ బ్యూటీ కాజోల్ తో చాలా సినిమాల్లో నటించి.. ప్రేమించి.. పెళ్లి చేసుకున్నాడు అజయ్. పెళ్లి తరువాత కూడా కొన్ని సినిమాల్లో ఇద్దరూ జంటగా నటించారు. ప్రస్తుతం మైదాన్ లాంటి సినిమాలతో బాలీవుడ్ లో.. ట్రిపుల్ ఆర్ తో సౌత్ లో హడావిడి చేస్తున్నాడు అజయ్.

Bigg Boss 5: ఇంటి చివరి కెప్టెన్‌గా షణ్ముక్.. పక్కా ప్లాన్ వేసి మరీ!

బాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు.. భారీ రెమ్యూనరేషన్ కు కేరాఫ్ అడ్రస్ గా మారాడు అక్షయ్ కుమార్. ఈ స్టార్ హీరో కూడా ఈ ఏడాదే 30 ఇయర్స్ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నాడు. బాలీవుడ్ లో 1991 లో సౌగంధ్ సినిమాతో కెరీస్ స్టార్ట్ చేసిన అక్షయ్ ఆ తరువాత చాలా ఒడిదుడుకులు ఫేస్ చేస్తూ.. స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా అక్షయ్ రికార్డ్ సాధించాడు. అంతే కాదు బాలీవుడ్ లో 200 కోట్లకు పైగా బడ్జెట్ తో అక్షయ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా సూర్యవంశీతో 200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించాడు అక్షయ్. హీరోగా ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఇటు సౌత్ లో పక్షిరాజు లాంటి పాత్రలో ప్రయోగాలు చేసిన స్టార్ హీరో.. ప్రయోగాత్మక సినిమాలతో పాటు.. కమర్షియల్ సినిమాలతో దూసుకుపోతున్నాడు.

Peddanna: సందడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్!

30 ఇయర్స్ కెరీర్ ను ఎప్పుడో క్రాస్ చేశాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్. ఆమీర్ 1973 నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. హీరోగా మాత్రం 89 నుంచి ప్రొజెక్ట్ అయ్యాడు. బాలీవుడ్ లో ఎక్స్ పెర్మెంట్స్ చేయాలంటే అది ఆమీర్ కే సాధ్యం. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు వరుస చేసుకుంటూ.. బాలీవుడ్ తో పాటు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో స్పెషల్ పేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఆమీర్. పీకే, దంగంల్ లాంటి సినిమాలతో ప్రపంచ సినిమాను ఆకర్షించిన ఆమీర్.. దంగంల్ తో ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్లుకు పైగా కలెక్షన్ సాధించి బాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆమీర్ ఖాన్ ప్రోడక్షన్స్ తో సినిమాలు నిర్మిస్తున్నాడు. త్వరలో లాల్ సింగ్ చద్థాత్ ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు మిస్టర్ పర్ఫెక్ట్.

Bhumi Pednekar: అందాలతో భూమి రచ్చ.. మతులు పోగొడుతుందిగా!

ఖాన్స్ అంటే… ముందుగా గుర్తుకు వచ్చేది.. షారుఖ్-సల్మాన్ ఫ్రెండ్ షిప్. ఇండస్టరీలో వీరిద్దరి రూటే సెపరేట్.. ఒకరు ఇండస్ట్రీకి వచ్చిన 3 ఏళ్లతరువాత మరొకరు ఎంట్రీ ఇచ్చారు. కాని స్టార్ డమ్ లోమాత్రం ఇద్దరూ సమానంగా దూసుకుపోయారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీకి అరడుగు దూరంలో ఉన్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. సీరియల్ యాక్టర్ గా అడుగు పెట్టి.. హీరోగా ఛాన్స్ లు కొట్టి.. బాలీవుడ్ కే బాస్ అయ్యేంత స్టార్ డమ్ సంపాదించుకున్నాడు షారుఖ్. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కు ఉన్న ఫ్యాన్ బేస్ మరెవరికీ లేదు. 1992లో దివాన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన షారుఖ్.. బాలీవుడ్ ఖాన్స్ త్రయంలో టాప్ ప్లేస్ లో కొనసాగాడు. అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్ ముందు నుంచీ ఉన్నా.. షారుఖ్ వారిని మించి ఇమేజ్ ను సాధించాడు.

Samantha: కుక్కకు సమంత బర్త్‌డే విషెస్‌.. నెటిజన్ల ఆగ్రహం!

షారుఖ్ దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా చాలామంది యువతని లవ్ ట్రాక్ వైపు ఆకర్షించింది. సినిమా కూడా ఏడాదికి పైనే థియేటర్ లో సందడి చేసింది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్ గ్రీన్. మూవీ కెరీర్ లో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసిన హీరో.. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడ్డాడు. 2018లో జీరో సినిమాతో కెరీర్ కు బ్రేక్ ఇచ్చి.. రీసెంట్ గా పఠాన్ తో రీ ఫ్రెష్ గా రావడానికి పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. కాని తన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేస్ వల్ల మరోసారి షారుఖ్ కు తిప్పలు తప్పలేదు.

Prabhas: ప్రభాస్ ముందు ఖాన్లు, కపూర్లు, స్టార్లంతా చిన్నవాళ్ళేనా!

బాలీవుడ్ లో ఖాన్స్ త్రయంలో మంచి అనుభంధం ఉన్న హీరోలు షారుఖ్ ఖాన-సల్మాన్ ఖాన్. మధ్యలో కొన్ని పొరపొచ్చాలు వచ్చినా.. వాటిని క్లియర్ చేసుకుని ఈ ఇద్దరు స్టార్స్ కెరీర్ లో కలిసి ప్రయాణం చేస్తూనే ఉన్నారు. సల్మాన్ ఖాన్ 1989లో మైనే ప్యార్ కియాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ లో కండల వీరుడుగా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో సల్మాన్ ఇమేజ్ వేరు. కుచ్ కుచ్ హోతాహై.. ప్యార్ కియాతో డర్నా క్యా.. చోరీ చోరీ చుప్ కే చుప్ కే.. వాంటెడ్.. టైగర్ జిందాహై.. దబాంగ్.. ఇలా ఒక్కటేంటి.. 30 ఏళ్ల ఇండస్టరీ కెరీర్ లో సల్మాన్ తిరుగులేకుండా బాలీవుడ్ ను ఏలాడు.