Parineeti Chopra : రాజ్యసభ ఎంపీతో డేటింగ్ లో ఉన్న బాలీవుడ్ హీరోయిన్?? ముంబైలో షికార్లు..
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా డేటింగ్ లో ఉన్నట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇటీవల పరిణీతి చోప్రా, రాఘవ్ ముంబైలో రెస్టారెంట్స్ కి వెళ్తూ మీడియాకు చిక్కారు. ఓ రోజు డిన్నర్ కి, ఓ రోజు లంచ్ కి వెళ్తూ మీడియా కంట పడ్డారు. దీంతో.......................

Bollywood heroine Parineeti chopra dating with Aam Admi Party Rajyasabha MP Raghav Chadha rumors goes viral
Parineeti Chopra : బాలీవుడ్ లో 2011లో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కజిన్ పరిణీతి చోప్రా(Parineeti Chopra) సంవత్సరానికి ఒకటో, రెండో సినిమాలు చేస్తూ వస్తుంది. స్టార్ హీరోయిన్ కాకపోయినా బాలీవుడ్(Bollywood) లో ఓ మోస్తరు ఫాలోయింగ్, చేతిలో ఎప్పుడూ ఓ రెండు ప్రాజెక్టులతో ఉంటుంది పరిణీతి చోప్రా. బాలీవుడ్ లో లవ్ అఫైర్స్, డేటింగ్(Dating) రూమర్స్ చాలా కామన్ గా వింటూనే ఉంటాము. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ ఎవరితో ఒకరితో ముంబైలో(Mumbai) షికార్లు చేస్తూనే కనపడతారు. తాజాగా పరిణీతి చోప్రా ఓ రాజకీయ నాయకుడితో డేటింగ్ లోఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీకి(AAP) చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో(Raghav Chadha) పరిణీతి చోప్రా డేటింగ్ లో ఉన్నట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇటీవల పరిణీతి చోప్రా, రాఘవ్ ముంబైలో రెస్టారెంట్స్ కి వెళ్తూ మీడియాకు చిక్కారు. ఓ రోజు డిన్నర్ కి, ఓ రోజు లంచ్ కి వెళ్తూ మీడియా కంట పడ్డారు. దీంతో వీరి ఫోటోలు వైరల్ గా మారాయి. రాఘవ్, పరిణీతి ముంబైలోని ఓ రెస్టారెంట్ లో నైట్ డిన్నర్ చేసి వెళ్తూ అక్కడ ఉన్న మీడియాకి పోజులు కూడా ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో వీరిద్దరూ నిజంగానే డేటింగ్ లో ఉన్నారా? లేక ఏదైనా పని మీద కలిశారా అని సందేహం వ్యక్తమవుతుంది.
రాఘవ్ చద్దా రాజ్యసభ ఎంపీగా, గుజరాత్ ఆప్ కి కో ఇంచార్జ్ గా ఉన్నాడు ప్రస్తుతం. ఇక పరిణీతి ప్రస్తుతం ఓ రెండు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉంది. మరి వీరిద్దరూ ఎందుకు కలిశారో ఏమో కానీ, వీరు మాత్రం డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇద్దరూ స్పందించలేదు. బాలీవుడ్ హీరోయిన్ ఓ పొలిటీషియన్ తో రెస్టారెంట్స్ కి తిరుగుతుండటంతో అభిమానులు, జనాల్లో మరింత ఆసక్తి నెలకొంది.