Bollywood Movies: బాలీవుడ్ మైండ్ బ్లాంక్.. సక్సెస్ ఫార్ములా మర్చిపోయిందా?

ఎన్ని ప్రయోగాలు చేశినా.. ఎంత వెరైటీ కంటెంట్ ని సెలెక్ట్ చేసుకున్నా సరే.. రూట్స్ ని అస్సలు మర్చిపోవద్దు. కాని ప్రెజెంట్ బాలివుడ్ హీరోలు, డైరెక్టర్లంతా ఆ విషయాన్నే మర్చిపోతున్నారు.

Bollywood Movies: బాలీవుడ్ మైండ్ బ్లాంక్.. సక్సెస్ ఫార్ములా మర్చిపోయిందా?

Bollywood Movies

Bollywood Movies: ఎన్ని ప్రయోగాలు చేశినా.. ఎంత వెరైటీ కంటెంట్ ని సెలెక్ట్ చేసుకున్నా సరే.. రూట్స్ ని అస్సలు మర్చిపోవద్దు. కాని ప్రెజెంట్ బాలివుడ్ హీరోలు, డైరెక్టర్లంతా ఆ విషయాన్నే మర్చిపోతున్నారు. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ఎలిమెంట్స్ ని పక్కకుపెట్టేసి.. సినిమాను ఓ బ్రహ్మ పదార్థంలా మార్చేస్తున్నారు. అందుకే.. వరుస ఫెయిల్యూర్స్ తో సొంత ఆడియన్స్ లోనే పట్టు కోల్పోతున్నారు.

Pan India Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్‌పై టాలీవుడ్ దండయాత్ర!

స్ట్రాంగ్ స్టోరీ.. మాస్ కంటెంట్.. దుమ్మురేపే మ్యూజిక్.. సిచ్చుయేషన్ కి తగ్గట్టు వచ్చే ఎమోషన్స్.. కాస్త కామెడీ.. ఇంకాస్త క్లాస్ టచ్.. సినిమాకు వెళ్లే సగటు ప్రేక్షకుడు కోరుకునే మినిమం ఎలిమెంట్స్ ఇవే. సక్సెస్ ఫార్ములా కూడా ఇదే.. కాని ప్రస్తుతం బాలివుడ్ హీరోలు, డైరెక్టర్లు నేల విడిచి సాము చేస్తున్నారు.

Telugu Small Movies: రిలీజ్ కష్టాలు.. చిన్న సినిమాలకు పెద్ద చిక్కులు!

గత కొన్నేళ్లుగా బాలివుడ్ లో వస్తున్న సినిమాలన్ని ఆడియన్స్ కోసం కాకుండా.. హీరోలు, డైరెక్టర్లు తమ కోసం తీసుకున్నట్టుగా ఉన్నవే. అందుకే బాలివుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి ఓ పెద్ద హిట్టుపడి దాదాపు ఐదేళ్లు కావస్తోంది. జీరో మూవీతో ప్రయోగం చేశి పెద్ద జీరో అయిపోయాడు షారుక్. ఇప్పటికీ ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. బాలివుడ్ లో ఒక వర్గం ఆడియన్స్ కు మాత్రమే నచ్చే సినిమాలు చేస్తున్నాడు బాద్షా.. దీనికితోడు అర్థం కాని కాన్సెప్ట్స్ తో కన్ ఫ్యూజ్ చేస్తున్నాడు. మాస్ ఆడియన్స్ కు దూరమయ్యాడు.

Deepika Padukone: అందాల ద‌డ పుట్టిస్తున్న దీపిక ప‌దుకొణె!

సల్మాన్ ఖాన్ కూడా రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో హిందీ ఆడియన్స్ ను బోర్ కొట్టిస్తున్నాడు. అదే బాడీ ఎక్స్ పోజింగ్.. భారీ యాక్షన్ సీన్స్.. తుపాకులు.. బాంబులు.. రొటీన్ రివేంజ్ డ్రామాలతో సల్లూ భాయ్ సినిమాలన్నీ రొట్ట కొట్టుడులా మారాయి. అందుకే గతేడాది వచ్చిన రాధే రిజల్ట్ తో పెద్ద షాకే ఇచ్చారు ఆడియన్స్. ఇక సల్మాన్ అప్ కమింగ్ మూవీస్ కూడా.. యాక్షన్ జోనర్ లోనే రాబోతున్నాయి.

Unstoppable with NBK: మాన్ ఆఫ్ మాసెస్.. రియలిస్టిక్ బిహేవియర్.. అందుకే హిట్!

బాలివుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. సీక్రెట్ సూపర్ స్టార్ తర్వాత ఇప్పటిదాకా మరో సినిమా రాలేదు. ఈ ఏడాది ఏప్రిల్ లో లాల్ సింగ్ చద్దా మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఓ ఇంగ్లీష్ నవల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నా.. మాస్ ఆడియన్స్ ని ఏ లెవల్లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Rashmi Gautam: పూల చీరలో మెరిసిపోతున్న బుల్లితెర క్వీన్ రష్మీ!

సొంత స్టోరీల కంటె.. అరువు తెచ్చుకున్న కథలు, బయోపిక్స్, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, నావల్స్, రొమాంటిక్ డ్రామాలు.. ఇవన్నీ కుదరకపోతె రీమేక్ లు.. ఇవి తప్ప గత కొన్నేళ్లుగా బాలివుడ్లో ఫ్రెష్ స్టోరీస్ తో సినిమాలే రావడం లేదు. రణ్ వీర్ సింగ్, రణ్ బీర్ కపూర్ లాంటి యంగ్ హీరోలు కూడా బయోపిక్ ల కోసం పాకులాడుతున్నారు. కామన్ ఆడియన్స్ కి ఏం కావాలో మర్చిపోతున్నారు. ఆడియన్స్ ఎమోషన్స్ ని పట్టించుకోవడం లేదు.

Summer Releases: స్టార్లంతా సమ్మర్ బరిలోనే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా!

బాలివుడ్ సినిమాల నుంచి కోరుకున్న ఎంటర్టైన్మెంట్ కరువవ్వడంతోనే.. హిందీ ఆడియన్స్ పక్క చూపులు చూస్తున్నారు. అందుకే సౌత్ సినిమాలు బాలివుడ్ ఆడియన్స్ మనసు దోచుకుంటున్నాయి. అన్నీ కలగలిపిన మిక్చర్ పొట్లంలా హిందీ ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి. అందుకే.. బాలివుడ్ పై సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ డామినేషన్ పెరిగింది. సౌత్ సినిమా వస్తోందంటె నార్త్ హీరోలు భయపడే పరిస్థితి వచ్చిందిప్పుడు.