Bollywood : సౌత్ స్టార్లని బాగా క్యాష్ చేసుకుంటున్న బాలీవుడ్..

Bollywood : సౌత్ స్టార్లని బాగా క్యాష్ చేసుకుంటున్న బాలీవుడ్..

Bollywood wants south actors in their movies for south market

Bollywood :  బాలీవుడ్ కి మూడేళ్ల నుంచి మొన్న మొన్న పఠాన్ రిలీజ్ అయ్యే వరకూ ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ లేదు. ఎంత మంది స్టార్ కాస్ట్ ఉన్నా, ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టినా హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ వాడినా, ఒక్కటంటే ఒక్క పెద్ద హిట్ కూడా పడలేదు. కరెక్ట్ గా అదే టైమ్ లో కష్టాల్లో ఉన్న బాలీవుడ్ కి సక్సెస్ బాట పట్టించబోయే సౌత్ జాక్ పాట్ దొరికింది. సక్సెస్ కోసం ఇప్పుడు సౌత్ మీద డిపెండ్ అవుతోంది బాలీవుడ్. ఒక వైపు సౌత్ లో వేలకోట్ల కలెక్షన్లు, మరో వైపు నార్త్ లో వందల కోట్లు ఖర్చు పెట్టినా రాని కలెక్షన్లు. కొన్నాళ్లనుంచి సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న బాలీవుడ్ ని లిఫ్ట్ చేస్తోంది సౌత్ సినిమా. బాలీవుడ్ సినిమాల కలెక్షన్లకి, మార్కెట్ కి మంచి అవకాశాలు కల్పిస్తోంది సౌత్. నిజానికి పాన్ ఇండియా ఇమేజ్, క్రేజ్ సంపాదించుకోవడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి బాలీవుడ్ అంతా మేజర్ గా సౌత్ మీదే డిపెండ్ అవుతోందనడంలో ఏమాత్రం డౌట్ లేదు. లాంగ్వేజ్ తో సంబందం లేకుండా సౌత్ సినిమాల కంటెంట్, కలెక్షన్లు ,క్రేజ్ కి ఫిదా అయిపోయిన బాలీవుడ్ ఓ పక్క సౌత్ లో హిట్ అయిన సినిమాలు రీమేక్ చేస్తూనే మరో పక్క ఏరి కోరి సౌత్ స్టార్లని తమ సినిమాల్లో పెట్టుకుంటున్నారు. కుదిరితే క్యారెక్టర్, కుదరకపోతే క్యామియో అయినా చెయ్యమంటున్నారు.

ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న బాలీవుడ్ కి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాద్ షా పఠాన్ సినిమాతో పికప్ అయ్యారు. మోస్ట్ అవెయిటింగ్ హిట్ తో బాలీవుడ్ కి మైలేజ్ పెంచిన షారూఖ్ ఖాన్ కూడా సౌత్ హెల్ప్ తీసుకుంటున్నారు. వరసగా పెరుగుతున్న సౌత్ సినిమాల క్రేజ్ తో సౌత్ మార్కెట్ మీద కూడా కన్నేశారు షారూఖ్ . సౌత్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలంటే సౌత్ స్టార్ కాస్ట్ కంపల్సరీ అనుకున్న షారూఖ్ సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న తమిళ్ డైరెక్టర్ అట్లీతో జవాన్ మూవీని మరో 4నెలల్లో రిలీజ్ చెయ్యబోతున్నారు షారూఖ్ ఖాన్. ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా సౌత్ లేడీ సూపర్ స్టార్ అయిన నయనతారని తీసుకున్నారు. ఇక షారూఖ్ ఖాన్ కి విలన్ గా సౌత్ లో సూపర్ క్రేజ్ ఉన్న విజయ్ సేతుపతి నటిస్తున్నారు. జవాన్ లో సూపర్ క్రేజీ క్యారెక్టర్ లో బన్నీ కనిపించబోతున్నారని టాక్ నడుస్తోంది. అసలు ఈ క్యారెక్టర్ కి తమిళ్ స్టార్ విజయ్ ని అనుకున్నారట. కానీ ఇప్పుడు ఆ రోల్ అల్లు అర్జున్ దగ్గరకొచ్చిందని న్యూస్ నడుస్తోంది. పుష్ప తో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపిన అల్లు అర్జున్ బాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేస్తే ఆ సినిమా సక్సెస్ కి తిరుగులేదని ఫీలవుతున్నారు మేకర్స్. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి. ఇలా బాలీవుడ్ మూవీ అయినా సౌత్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న జవాన్ గ్యారంటీగా తనకి సౌత్ మార్కెట్ ని పెంచుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు షారూఖ్.

ఇప్పటికే పీకల్లోతు సినిమాలతో ఒక సినిమాకి మరో సినిమాకి షటిల్ సర్వీస్ చేస్తున్న ప్రభాస్ కి కూడా బాలీవుడ్ నుంచి వరసగా ఆఫర్లొస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ప్రభాస్ ని ఏరికోరి మా సినిమాలో చెయ్ అంటే మా సినిమాలో చెయ్ అంటూ వెంటపడుతున్నారు. వార్ ,పఠాన్ తో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన డైరెక్టర్ సిద్దార్ద్ ఆనంద్ ఈ సారి ప్రభాస్ తో సినిమా చెయ్యబోతున్నారు. ఆల్రెడీ బాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ సిద్దార్ద్ తో సినిమాలు చెయ్యడానికి రెడీగా ఉంటే ఈ టాప్ డైరెక్టర్ మాత్రం బాహుబలితో గ్లోబల్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ తో సినిమాకి రెడీ అవుతున్నారు. బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యష్ రాజ్ ఫిల్మ్స్ తన స్పై యాక్షన్ మల్టివర్స్ లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోగా ప్రభాస్ నే సెలక్ట్ చేసుకుందని సమాచారం.

సౌత్ స్టార్లు బాలీవుడ్ అవకాశాల కోసం ఎదురుచూసే రోజులు పోయాయి. ఇండియన్ సినిమాని ఏలేస్తున్న సౌత్ సినిమా ఇండస్ట్రీ కోసం నార్త్ సినిమాలే వెతుక్కుంటూ వస్తున్నాయి. సినిమాలో ఒక్క సీన్ లో నటించినా సౌత్ మార్కెట్ సొంతమవుతుందని ఆశపడుతున్నారు బాలీవుడ్ మేకర్స్. అందుకే ఏరి కోరి మరీ సౌత్ స్టార్లకి ఆఫర్లిస్తున్నారు. సౌత్ అంటే ఏదో తెలుగు, తమిళ్ అనే కాదు సౌత్ లాంగ్వేజెస్ లో ఎవరు దొరికినా వదలకుండా బాలీవుడ్ సినిమాల్ని సౌత్ ఆర్టిస్ట్ లతో నింపేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సౌత్ మీద ఎంత కాన్సన్ ట్రేట్ చేస్తున్నారో, సౌత్ ని ఎంతగా కావాలనుకుంటున్నారో రీసెంట్స్ టైమ్స్ చూస్తేనే తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ 30 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైమ్ తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ లో జస్ట్ చిన్న రోల్ చేశారు. కమాండో గా క్యామియో చేసిన సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ తో తెలుగు వాళ్లని ఇంప్రెస్ చెయ్యాలన్న ప్లాన్ వర్కవుట్ చేశారు. ఇక తన అప్ కమింగ్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ని సౌత్ ఆర్టిస్ట్ లతో నింపేశారు. కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాలో సౌత్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన జగపతి బాబుతో ఫైట్ చెయ్యబోతున్నారు సల్మాన్. అంతేకాదు సౌత్ సీనియర్ హీరో వెంకటేష్ తో ఇపార్టెంట్ రోల్ ప్లే చేయిస్తున్నారు భాయ్. ఇవే కాకుండా సౌత్ లో స్టార్ హీరోలతో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకున్న పూజాహెగ్డేని తనకు జంటగా సెట్ చేసుకున్నారు సల్మాన్ ఖాన్. ఇవన్నీ ఒక ఎత్తైతే రామ్ చరణ్ కూడా క్యామియో రోల్ ప్లే చేస్తున్నారని సమాచారం. ఇలా మొత్తం సౌత్ ఆర్టిస్ట్ లతోనే నింపేశారు సల్మాన్ ఖాన్. ఏప్రిల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సౌత్ స్టార్ కాస్ట్ తో పాన్ ఇండియా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యడానికి గట్టిగానే ప్లాన్ చేశారు సల్మాన్.

బాలీవుడ్ వాళ్లు ఏరికోరి మరీ తమిళ్ నుంచి పిలిపించుకున్న వర్సెటైల్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి. తెలుగు, తమిళ్ లో సాలిడ్ హిట్స్ మీదున్న విజయ్ సేతుపతి యాక్టింగ్ కి ఫిదా అయిన బాలీవుడ్ క్రతినా కైఫ్ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు. 2017 లో తమిళ్ లో రిలీజ్ అయిన మానగరంని హిందీలో మెర్రీ క్రిస్ మస్ గా రీమేక్ చేస్తున్నారు శ్రీరామ్ రాఘవన్. ఇప్పటికే బాలీవుడ్ వెబ్ సిరీస్ ఫర్జీలో మాస్ కాప్ గా బాలీవుడ్ ఆడియన్స్ ని తెగ ఇంప్రెస్ చేసేశారు విజయ్ సేతుపతి.

సౌత్ స్టార్ కాస్ట్ తోనేకాదు సౌత్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల మీదకూడా కన్నేశారు బాలీవుడ్ హీరోలు. సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తూ సౌత్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆకాశమే నీహద్దురా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో సూర్య, డైరెక్టర్ సుధకొంగర తో బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ సినిమా చేస్తున్నారు. సుధ డైరెక్షన్లోనే, సూర్య ప్రొడ్యూసర్ గా ఈ సినిమా చేస్తున్నారు అక్షయ్.

మలయాళ హీరోగా టాప్ పొజిషన్ లో ఉన్న పృధ్విరాజ్ హిందీలో సూపర్ హిట్ మూవీ బడేమియా చోటేమియాలో కబీర్ క్యారెక్టర్ లో విలన్ గా చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టైగర ష్రాఫ్ లీడ్ రోల్స్ లో అలీ అబ్బాస్ జఫర్ డైరెక్షన్లో తెరకెక్కుతోంది. పాన్ ఇండియా రిలీజ్ కి పృధ్విరాజ్ ఇమేజ్ హెల్ప్ అవుతుందన్న బాలీవుడ్ హీరోల ప్లాన్ బాగానే వర్కవుట్ అయ్యేలానే కనిపిస్తోంది.

ఇప్పటికే మరో మళయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ లో క్యారవాన్, చుప్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. సీతారామం సినిమాతో సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా హిట్ కొట్టారు దుల్కర్ సల్మాన్. లేటెస్ట్ గా ఫ్యామిలీ మ్యాన్ చేసిన డి.కె రాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న కామెడీ థ్రిల్లర్ గన్స్ అండ్ గులాబ్స్ లో వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ లో దుల్కర్ సల్మాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సిరీస్ లో బాలీవుడ్ వర్సెటైల్ హీరో రాజ్ కుమార్ రావ్ ఉన్నా సౌత్ మార్కెట్ ని పుల్ చెయ్యడానికి దుల్కర్ ని యాడ్ చెయ్యకతప్పలేదు మేకర్స్.

సౌత్ సినిమాలు, సౌత్ కంటెంట్ తో పాటు సౌత్ హీరోయిన్ల మీద తెగ మనసు పడుతున్నారు బాలీవుడ్ హీరోలు. స్టార్ హీరో షారూఖ్ నయనతారే కావాలని వెతుక్కుంటూ వచ్చి జవాన్ లో పెట్టుకున్నారు. ఇక సమంతని అయితే బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చెయ్యమని ఆఫర్ల మీద ఆఫర్లిస్తున్నారు. సౌత్ లో సోలో గానే జనాల్ని ధియేటర్లకు పుల్ చెయ్యగల సమంత బాలీవుడ్ లో యాక్ట్ చేస్తే సౌత్ కలెక్షన్లు గ్యారంటీ గా పెరుగుతాయని ప్లాన్ చేసిన మేకర్స్ హిందీ లో హ్యాపెనింగ్ హీరో అయిన వరుణ్ ధావన్ తో సిటాడెల్ రీమేక్ లో సమంతే కావాలని పట్టుబట్టారు. అంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేసిన సమంత పుష్ప లో స్పెషల్ సాంగ్ తో బాలీవుడ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.

సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక ఇప్పటికే బాలీవుడ్ ఫాన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేసి నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. సౌత్ సినిమాలతో ఇప్పటికే టాప్ హీరోయిన్ గా బిజీ అయిపోయిన రష్మికని తమ సినిమాల్లో ఆఫర్లిచ్చి బిజీ చేసేశారు బాలీవుడ్ మేకర్స్. ఆల్రెడీ గుడ్ బై,మిషన్ మజ్ను సినిమాలు చేసిన రష్మిక బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో సందీప్ వంగా డైరెక్ట్ చేస్తున్న యానిమల్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.

కశ్మీర్ ఫైల్స్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి వాక్సిన్ వార్ అనే భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. 9 భాషల్లోరిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబందించి సౌత్ మేకర్స్ తో పాటు సౌత్ ఆర్టిస్టుల్నే ఎక్కువ సెలక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ తెలుగు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథా సహకారం తోపాటు సౌత్ స్టార్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో కన్నడ లేటెస్ట్ సెన్సేషన్ సప్తమి గౌడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. కాంతారతో బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా మెప్పించిన సప్తమి గౌడ కన్నడ మార్కెట్ ని గ్రాబ్ చేస్తుందని ఫిక్స్ అయ్యారు టీమ్.

Vinaro Bhagyamu Vishnu Katha : వినరో భాగ్యము విష్ణు కథ.. వినాలన్నా, అర్ధం చేసుకోవాలన్నా కొంచెం కష్టమే..

సౌత్ లో సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న రకుల్ ప్రీత్ , రాశి ఖన్నా ఈ హీరోయిన్లద్దరూ బాలీవుడ్ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. వీళ్ళకి ఫిదా అయిన బాలీవుడ్ పిలిచి మరీ వరసగా సినిమాలు చేస్తున్నారు. రాశిఖన్నా షాహిద్ కపూర్ తో లేటెస్ట్ గా సూపర్ థ్రిల్లర్ ఫర్జీ సిరీస్ చేసింది. సిద్దార్ద్ మల్హోత్రా యోధ సినిమాలో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా నటిస్తోంది రాశిఖన్నా. ఇక పలువురు బాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ సౌత్ ఆర్టిస్టులతో సినిమాలు చేస్తామంటూ ముందుకొస్తున్నారు. ఇలా టాప్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు.. బాలీవుడ్ అంతా కూడా సౌత్ క్రేజ్ ని క్యాష్ చేస్కోడానికి బాగా ట్రై చేస్తున్నారు.