Chiranjeevi : చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ రక్తదానం.. మెగాస్టార్ అభిమానులు ఉన్న ప్రతిచోట బ్లడ్ బ్యాంక్ ఉన్నట్టే..

నేడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వ్యనన్ కి మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానం పలికారు. చిరంజీవి రక్తనిధి కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. చిరంజీవి రక్తనిధి కేంద్రం వివరాలను బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ కు చిరంజీవి...............

Chiranjeevi : చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ రక్తదానం.. మెగాస్టార్ అభిమానులు ఉన్న ప్రతిచోట బ్లడ్ బ్యాంక్ ఉన్నట్టే..

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి రీల్ లోనే కాదు బయట కూడా ఎంతో మందికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తో ఎంతో మంది అత్యవసరం ఉన్న వారికి రక్తాన్ని అందించి ప్రాణాలు నిలిపారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అభిమానులు, పలువురు ప్రముఖులు రక్తదానం చేస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వ్యన్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ని సందర్శించి రక్తదానం చేశారు.

నేడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వ్యనన్ కి మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానం పలికారు. చిరంజీవి రక్తనిధి కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. చిరంజీవి రక్తనిధి కేంద్రం వివరాలను బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ కు చిరంజీవి సోదరి మాధవి వివరించారు. అనంతరం గారెత్ వ్యన్ రక్తదానం చేశారు. ఆయన రక్తదానం చేస్తుండగా పక్కనే ఉండి మాట్లాడారు చిరంజీవి.

RRR : రాజమౌళికి మరో హాలీవుడ్ అవార్డు..

అలాగే అత్యధిక సార్లు రక్తదానం చేసిన 25 మంది రక్తదాతలకు జీవిత బీమా కార్డులను చిరంజీవి, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ కలిసి అందచేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నేను ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను. ఇటీవల ఇండియన్ ఫిల్మ్ పర్సనల్టీ అవార్డు వచ్చింది. నేడు మన బ్లడ్ బ్యాంక్ కి గారేత్ వ్యన్ రావటం చాలా సంతోషంగా ఉంది. నేను ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు వారు అభినందనలు తెలియజేసారు. అభిమానులు లేకపోతే ఇది సాధ్యం కాదు. 25 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన రక్తదాతలకు 7 లక్షల జీవితబీమా కార్డులను అందజేశాం. రెండో విడతలో 1500 మంది రక్తదాతలకు జీవితబీమా కార్డులు ఇస్తున్నాం. ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కాల్ తో నా అభిమానులు అక్కడ బ్లడ్ ఇస్తున్నారు. హైదరాబాద్ లోనే కాదు ప్రతి ఊరిలో ప్రతి చోట నా అభిమానులున్నారు. నా అభిమానులు ఉన్న చోట బ్లడ్ బాంక్ ఉన్నట్టే అని తెలిపారు.