Salaar: డేట్ ఫిక్స్ చేసుకున్న సలార్..? | Buzz On Salaar Release Date Locked

Salaar: డేట్ ఫిక్స్ చేసుకున్న సలార్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లాస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు....

Salaar: డేట్ ఫిక్స్ చేసుకున్న సలార్..?

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లాస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. అందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాలో ప్రభాస్ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి ఇప్పటికే లీక్ అయిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతూ వచ్చింది.

Salaar: పూర్తి యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిన సలార్

ఇక తాజాగా సలార్ చిత్రానికి సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. సలార్ చిత్రాన్ని తొలుత ఏప్రిల్ 2022లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ కరోనా పాండెమిక్ కారణంగా ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడటంతో, ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌కు చాలా రోజుల సమయం పడుతుండటంతో, ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పవా..?

ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ మరో లెవెల్‌లో ఉండనుండగా, ఆయన చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా టాప్ రేంజ్‌లో ఉంటాయట. కాగా.. ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కేజీయఫ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో సలార్ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. మరి నిజంగానే ఈ సినిమాను 2023 ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తారా లేక రిలీజ్ డేట్‌ను మళ్లీ మారుస్తారా అనేది వేచి చూడాలి.

×