Chalo Premiddam: ఛలో ప్రేమిద్దాం రివ్యూ

ప్రెజ‌ర్ కుక్క‌ర్‌ ఫేమ్ సాయి రోన‌క్‌, 90 ఎమ్ ఎల్ ఫేమ్ నేహ సోలంకి జంట‌గా న‌టించిన తాజా చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ పతాకంపై ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తున్న..

Chalo Premiddam: ఛలో ప్రేమిద్దాం రివ్యూ

Chalo Premiddam

చిత్రం: ఛలో ప్రేమిద్దాం

ప్రెజ‌ర్ కుక్క‌ర్‌ ఫేమ్ సాయి రోన‌క్‌, 90 ఎమ్ ఎల్ ఫేమ్ నేహ సోలంకి జంట‌గా న‌టించిన తాజా చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ పతాకంపై ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె దర్శకత్వం వహించాడు. ఇప్పటికే టీజర్, పాటలు, ట్రైలర్ ద్వారా ఛలో ప్రేమిద్దాం సినిమా యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని గుర్తు చేస్తూ వచ్చింది. కాగా ఈరోజే (నవంబర్‌ 19)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నటీనటులు: సాయి రోనక్, నేహా సోలంకి, శ‌శాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, హేమ‌, ర‌ఘు కారుమంచి, సూర్య‌, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ ఇలా భారీ తారాగణమే ఉంది.
ఛాయాగ్రహణం:

సాంకేతిక వర్గం – సంగీతం – భీమ్స్ సిసిరోలియో, పాట‌లుః సురేష్ గంగుల‌, దేవ్‌,
ఎడిటింగ్ – ఉపేంద్ర జ‌క్క‌, ఆర్ట్ డైర‌క్ట‌ర్ – రామాంజ‌నేయులు, ఫైట్స్ -న‌భా-సుబ్బు,
కొరియోగ్ర‌ఫీ – వెంక‌ట్ దీప్‌, సినిమాటోగ్ర‌ఫీ – అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి
నిర్మాత: ఉద‌య్ కిర‌ణ్‌
రచన – దర్శకత్వం: సురేష్ శేఖ‌ర్ రేపల్లే

కథ: వైజాగ్‌కి చెందిన యువకుడు ఆత్మారావు (సాయి రోనక్). అతనిది మిడికల్ క్లాస్‌ ఫ్యామిలీ. నాన్న(పోసాని) ఓల్డేజ్‌ హోమ్‌లో మేనేజర్‌. తల్లిదండ్రులను ఓల్డేజ్‌ హోమ్‌లో వదిలేసి వెళ్లిపోయిన కొడుకులను చూసిన పోసాని కొడుకులంటే కోపం. ఆ కోపాన్ని తన కొడుకు ఆత్మారావుపై చూపిస్తుంటాడు. కొడుకు ఎక్కడ తప్పు చేస్తాడా, తిడదామా అని వెయిట్‌ చేస్తుంటాడు. కానీ ఆత్మారావు చదువుల్లో ఫస్ట్ ఉంటాడు. తండ్రికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వడు. ఈ క్రమంలో అతను హైయ్యర్‌ స్టడీస్‌ కోసం హైదరాబాద్‌ వెళతాడు. అక్కడ మధుమతి పరిచయం అవుతుంది. ఆమెకి ఆత్మారావు ముందే తెలుసు. ఓ అమ్మాయిని తన బాస్‌ వేధింపుల నుంచి రక్షించేందుకు హెల్ప్ చేసిన సీన్‌ చూసి అప్పుడే అతనికి పడిపోతుంది. ఇక హైదరాబాద్‌లో మధుమతి చేసే పనులకు ఇంప్రెస్‌ అయిన ఆత్మారావు ఆమె ప్రేమలో పడతాడు. తన ప్రేమని వ్యక్తం చేసే టైమ్‌ వస్తుంది. ప్రేమని వ్యక్తం చేయగా మధుమతి సైలెంట్‌గా వెళ్లిపోతుంది. కట్‌ చేస్తే చిత్తూరికి మధుమతి అక్క మ్యారేజ్‌ కోసం కాలేజ్‌ ఫ్రెండ్స్ తోపాటు ఆత్మారావు కూడా వెళ్తాడు. అక్కడ తనని పెంచి పోషిస్తున్న పెద్దప్ప(నాగినీడు).. మధుమతి ప్రేమని అంగీకరించాడా? పెద్దప్పకి, మధుమతి తండ్రి నాగప్ప(సిజ్జు)కి గొడవేంటి? అక్కడ ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయనేది మిగిలిన సినిమా.

Tollywood Gossips: రూమర్స్‌ను నిజం చేస్తున్న మేకర్స్..!

ఇదొక కమర్షియల్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమని చెప్పొచ్చు. ఒకరకంగా ఇది స్టార్ హీరోలు చేసే స్థాయి కథని చెప్పొచ్చు. తొలి చిత్రంతోనే దర్శకుడు సురేష్‌ శేఖర్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకున్నాడు. ట్రైలర్, టీజర్ చూస్తే యూత్ ఫుల్ సినిమాగా అనిపించినా క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. ఎక్కడా వల్గారిటీకి తావులేదు. మొదట్లో హీరో తండ్రి పోసాని, తల్లి హేమ, వాళ్ల కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తుంటాయి. కాలేజ్‌ ఎపిసోడ్‌ సరదాగా సాగుతుంది. హైదరాబాద్‌లో మధుమతికి ఇంప్రెస్‌ అయ్యే సన్నివేశాలు, ఆ అమ్మాయి తన ఇరిటేషన్‌ని చిన్న స్లిప్‌లలో చెప్పే సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. దీనికి తోడు కాలేజ్‌లో పవన్‌, భరత్‌, అలాగే కారుమంచి రఘులతో వచ్చేసన్నివేశాలు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. ఫస్టాఫ్‌ సరదాగా సాగుతుంది.

Vindhya Vishaka: అందాలే ఆయుధంగా యాంకర్ వింధ్యా!

సెకండాఫ్‌ కథ మొత్తం రాయలసీమలోని చిత్తూరుకి వెళ్తుంది. అక్కడ పెద్దప్ప నాగినీడు ఊరు పెద్ద. తనకి ఆస్తులు లేకుండా చేశాడని, తనని పదవులకు దూరం చేశాడని పెద్దప్పపై నాగప్ప పగతో రగిలిపోతుంటాడు. ఆయన్ని చంపేసేందుకు ప్లాన్లు చేస్తుంటాడు. అక్కడ ఎమ్మెల్యే ప్రభాకర్‌ పాలన బాగా లేదని ఊర్లో జనం చెప్పడంతో ఎదురుతిరిగిన ప్రభాకర్ ని జనం ముందు తంతాడు పెద్దప్ప. దీంతో తన పరువు పోయిందని ప్రభాకర్‌ ఆయనపై పగ పెంచుకుంటాడు. పెద్దప్పని చంపేసేందుకు ప్లాన్‌ చేస్తుంటాడు. మరోవైపు అక్క పెళ్లిలో మధుమతి తన ప్రేమ విషయం అన్న శివన్న(శశాంక్‌)కి చెబుతుంది. మరోవైపు హీరో ఫ్రెండ్స్ బ్యాచ్‌లోకి గేని పంపించి ఆటపట్టించడం వంటి సన్నివేశాలతో ఓ వైపు ఎంటర్‌టైన్‌మెంట్‌, మరోవైపు సీరియస్‌ సీన్లని చాలా క్లీన్‌గా రాసుకున్నాడు దర్శకుడు. వెటికవే సెపరేట్‌గా స్పెస్‌ ఇస్తూ వాటిని మలిచిన తీరు బాగుంది. ఫస్టాఫ్‌లో మధ్య మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు, సెకండాఫ్‌లో పెళ్లి ఈవెంట్‌లో వచ్చి సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి.

Bigg Boss 5: సారీ సారీ అంటూనే హగ్గులు.. ముద్దులు.. అరే ఏంట్రా ఇది!

కథనం-విశ్లేషణ:

నటీనటులు: హీరోగా నటించిన సాయి రోనక్‌ బాగానే చేశాడు. ఎక్స్ ప్రెషన్స్ పలికించడంలో మరింత అనుభవం కావాలనేది అర్థమవుతుంది. మధుమతిగా హీరోయిన్‌ నేహా సోలంకి చాలా బాగా చేసింది. సందడంగా ఆ అమ్మాయిదే అనేట్టు చేసింది. `ఫోన్ ఎక్కువ మాట్లాడకండి.. మ్యాటర్‌ పనిచేయదు` లాంటి డైలాగులు హీరోయిన్‌ చెప్పిన విధానం బాగా పేలింది. కారుమంచి రఘు కామెడీ ఆకట్టుకుంటుంది. మరోవైపు ఫ్రెండ్స్ గా భరత్‌, పవన్‌ ఫర్వాలేదనిపించారు. పోసాని, హేమ, నాగినీడు, ప్రభాకర్‌, సిజ్జు, శశాంక్‌ పాత్రలు తమ పాత్ర పదిరి మేరకు ఫర్వాలేదనిపించాయి.

Simbu: వేదికపై కన్నీరు పెట్టుకున్న శింబు.. ఇబ్బంది పెడుతున్నదెవరు?

సాంకేతిక వర్గం: దర్శకుడు సురేష్‌ కొత్త డైరెక్టర్‌ అయినా మంచి అటెప్ట్ చేశాడని చెప్పొచ్చు. కథని నడిపించే విషయంలో ప్రతిభ చూపాడు. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకి ప్లస్‌ అని చెప్పాలి. పాటలు చాలా బాగున్నాయి. ఆర్‌ఆర్‌ సైతం ఆకట్టుకుంటుంది. సంగీతమే సినిమాకి బలం. సురేష్‌ గంగుల మెలోడీ సాంగ్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి. అదే సమయంలో పాటలు ఒకటి రెండు తగ్గిస్తే బాగుండేది. అజిత్‌ వి రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి.మరోవైపు నిర్మాణ విలువలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాల స్థాయిలో నిర్మించారు. ఫారెన్‌ లొకేషన్ల విషయంలో నిర్మాణ విలువలు రిచ్ గా కనిపిస్తాయి. రాజీపడకుండా నిర్మించారని చెప్పొచ్చు.

Aha-Netflix: ఓటీటీలో వచ్చేసిన మరో రెండు సినిమాలు..!

చివరగాః కథ, కథనం అన్నీ ఉన్నా అక్కడక్కడా ఇది చూశామేమో అనిపిస్తుంది. అలా అని పాత పచ్చడే కదా అని తీసిపారేసేది కాదు. తనకున్న పరిధిలో దర్శక, నిర్మాతలు చేయాల్సింది చేశారు.. థియేటర్ సీట్ లో ఉండగా బోర్ కొట్టేంత పసలేని సినిమా కాదు.. అలా అని ఇంటికి వచ్చాక కూడా మనతో వచ్చే సినిమా కూడా కాదు.