Chandramukhi 2: అలా మొదలెట్టి, ఇలా ముగించేసిన చంద్రముఖి-2

తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సినిమా ‘చంద్రముఖి’ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, ఈ సినిమాకు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా చంద్రముఖి-2 చిత్రాన్ని తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్.

Chandramukhi 2: అలా మొదలెట్టి, ఇలా ముగించేసిన చంద్రముఖి-2

Chandramukhi 2: తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సినిమా ‘చంద్రముఖి’ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, ఈ సినిమాకు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా చంద్రముఖి-2 చిత్రాన్ని తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. తొలి భాగంలో హీరో రజినీకాంత్ నటించిన తీరు ప్రేక్షకులను ఎలా మెస్మరైజ్ చేసిందో అందరికీ తెలిసిందే.

Chandramukhi2: అఫీషియల్.. చంద్రముఖి సీక్వెల్‌లో లారెన్స్ ఎంట్రీ!

అయితే చంద్రముఖి-2 సినిమాలో హీరోగా రజినీకాంత్ బదులుగా, రాఘవ లారెన్స్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక దర్శకుడు పి.వాసు తెరకెక్కిస్తున్న చంద్రముఖి-2 సినిమా షూటింగ్‌ను ఇటీవల ప్రారంభించగా, తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా అప్పుడే పూర్తి చేసుకుంది. మైసూరులో జరుగుతున్న తొలి షెడ్యూల్ షూటింగ్ నేటితో ముగించేసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Tamil Movies : క్లాసిక్ హిట్స్‌కి సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్న కోలీవుడ్..

ఇక ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా, ఎంఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని పి.వాసు భావిస్తున్నాడు. మరి రజినీకాంత్ ప్లేస్‌లో నటిస్తున్న రాఘవ లారెన్స్, ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.