Young Hero’s: మారుతున్న ట్రెండ్.. స్టార్ హీరోల సినిమాలలో యంగ్ హీరోలు!

టాలీవుడ్ ట్రెండ్ మారుతోంది. సోలో హీరోగానే కాకుండా.. మల్టీస్టారర్ గా సినిమాలు చేస్తూ.. ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా పెద్ద హీరో సినిమాల్లో చిన్న హీరోలు..

Young Hero’s: మారుతున్న ట్రెండ్.. స్టార్ హీరోల సినిమాలలో యంగ్ హీరోలు!

Young Hero's

Young Hero’s: టాలీవుడ్ ట్రెండ్ మారుతోంది. సోలో హీరోగానే కాకుండా.. మల్టీస్టారర్ గా సినిమాలు చేస్తూ.. ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా పెద్ద హీరో సినిమాల్లో చిన్న హీరోలు యాక్ట్ చేసి అటు మైలేజ్ తో పాటు.. సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు. మరి చిరంజీవి, రవితేజ లాంటి స్టార్ మూవీస్ లో నటించే చాన్స్ దొరికితే అసలు వదలడం లేదు. స్టార్ హీరోల సినిమాలలో నటించే చాన్స్ వస్తే ఎవరువద్దనుకుంటారు..? అందుకే చిన్న రోల్ అయినా సరే.. స్టార్ హీరోలతో కనిపించడానికి రెడీ అవుతారు జూనియర్ హీరోలు.

NBK 107: క్రాక్ కాంబినేషన్ రిపీట్.. బాలయ్య కోసం జయమ్మ ఫిక్స్!

అలాంటిది మెగాస్టార్ చిరంజీవి పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు సత్యదేవ్, నాగశౌర్య. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న గాడ్ ఫాదర్ లో సత్యదేవ్, భోళాశంకర్ లో కీర్తిసురేష్ కి జంటగా నాగశౌర్య నటిస్తున్నట్టు టాలీవుడ్ లో వార్తలు స్పీడప్ అయ్యాయి. మాస్ మహారాజా రవితేజ సినిమాలో మరో అప్ కమింగ్ హీరో నటిస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. నక్కిన త్రినాధ రావు డైరెక్షన్లో రవితేజ నటిస్తున్న ధమాకా సినిమాలో మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో రాజ్ తరుణ్ నటిస్తున్నాడని న్యూస్.

Atithi Devo Bhava: నానీ చేతుల మీదుగా ఆది ‘అతిధి దేవోభవ’ ట్రైలర్!

స్టోరీకి, రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేసే హీరో రాజ్ తరుణ్ కావడంతో ఈ ఎనర్జిటిక్ హీరో రవితేజ సినిమాలో ఫిక్సయ్యాడని టాక్ వినిపిస్తోంది. అప్ కమింగ్ మూవీస్ లోనే కాకుండా.. మొన్నీ మద్య రిలీజ్ అయిన నాని శ్యామ్ సింగరాయ్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు హీరో రాహుల్. అందాల రాక్షసి సినిమాతో ఆడియన్స్ ని అలరించిన రాహుల్.. చాలా కాలం తర్వాత శ్యామ్ సింగరాయ్ లో నానికి ఫ్రెండ్ గా నటించి ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు. ఇలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కోసం పెద్ద సినిమాల్లో చిన్న హీరోల్ని సెలక్ట్ చేసుకుంటున్నారు మేకర్స్.