Vision document: ఇలాంటి ఫండ్స్‌ దేశంలోనే తొలిసారి.. మహిళలు, రైతులు, యువత, పిల్లల కోసం ఏం చేయనున్నారంటే?

స్కాండినేవియన్ మోడల్ అంటే సామాజిక భద్రత, ప్రజా సంక్షేమం ప్రధాన లక్ష్యంగా నడిచే విధానం.

Vision document: ఇలాంటి ఫండ్స్‌ దేశంలోనే తొలిసారి.. మహిళలు, రైతులు, యువత, పిల్లల కోసం ఏం చేయనున్నారంటే?

Updated On : December 9, 2025 / 10:54 PM IST

Vision document: తెలంగాణను 2034లోగా ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047లోగా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ లక్ష్యం కేవలం ఆర్థిక వ్యవస్థను బలపర్చడానికి మాత్రమే కాదు.

సమసమాజం దిశగా, ప్రజా సేవలో దీన్ని ఒక సాధనంగా వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సమగ్ర, స్థిర సంక్షేమం అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రణాళికను రూపొందించింది.

పెద్ద ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ, అసమానతలు అధికంగా ఉంటే అనేక మంది ప్రజలు ఆ ఆర్థిక ప్రయోజనాలను అందుకోలేరు. అది ఆదర్శపూరిత మార్గం కాదు.

ఆర్థిక వృద్ధి అందరికీ సమానంగా ఫలితాలను అందించేలా ఉండాలి. ప్రతి పౌరుడు సమాన అవకాశాలు, లాభాలు పొందే స్థితి రావాలి. జీవన ప్రమాణాలు పెరగాలి.

Also Read: తెలంగాణ రైజింగ్-2047 విజన్‌ డాక్యుమెంట్‌లో పేర్కొన్న గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్స్ ఇవే..

ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం మహిళలు, రైతుల, యువత, పిల్లల.. సంక్షేమ, సామాజిక అభివృద్ధి మీద దృష్టి పెట్టింది. పౌరులందరి దీర్ఘకాలికంగా అభివృద్ధి ఫలాలు అందేలా, వారి శ్రేయస్సు, మెరుగైన జీవనం స్థిరంగా కొనసాగేలా ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, ఉపాధి, ఆర్థిక సాధికారికత మీద దృష్టి పెట్టి ఈ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించింది.

ప్రత్యేక సంక్షేమ నిధి వచ్చేస్తుంది..
బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ నిధి సృష్టించనుంది. దేశంలో ఇటువంటి నిధిని సృష్టిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణనే. ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం స్కాండినేవియన్ మోడల్ పెన్షన్, సంక్షేమానికి నిధులు ఏర్పాటు చేయడం. స్కాండినేవియన్ మోడల్ అంటే సామాజిక భద్రత, ప్రజా సంక్షేమం ప్రధాన లక్ష్యంగా నడిచే విధానం.