తొలి టీ20 మ్యాచులో 101 పరుగుల తేడాతో టీమిండియా విజయం.. సౌతాఫ్రికా వికెట్లు టపా టపా ఎగిరిపోయాయ్..
టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.
Pic: @BCCI
Ind vs SA: భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచులో టీమిండియా 101 పరుగుల తేడాతో గెలుపొందింది.
టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. అభిషేక్ శర్మ 17, శుభ్‌మన్ గిల్ 4, సూర్యకుమార్ యాదవ్ 12, తిలక్ వర్మ 26, అక్షర్ 23, హార్దిక్ పాండ్యా 59, శివమ్ దూబే 11, జితేశ్ శర్మ 10 పరుగులు బాదారు. దీంతో టీమిండియా స్కోరు 20 ఓవర్లకు 175/6గా నమోదైంది.
సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3, సిపాంలా 2, డోనోవన్ ఫెరెయ్రా ఒక వికెట్ తీశారు.
లక్ష్యఛేదనలో సౌత్రాఫ్రికా బ్యాటర్లు ఏ మాత్రం రాణించలేకపోయారు. 12.3 ఓవర్లకే ఆలౌట్ అయ్యారు. సౌత్రాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్ డి కాక్ 0, ఐడెన్ మార్క్రామ్ 14, ట్రిస్టన్ స్టబ్స్ 14, డెవాల్డ్ బ్రెవిస్ 22, డేవిడ్ మిల్లర్ 1, డోనోవన్ ఫెరెయ్రా 5, మార్కో జాన్సెన్ 12, కేశవ్ మహారాజ్ 0, అన్రిచ్ నోర్కియా 1, లుతో సిపాంలా 2, లుంగి ఎంగిడి 2 పరుగులు తీశారు. దీంతో దక్షిణాఫ్రికా స్కోరు 12.3 ఓవర్లలో 74/10గా నమోదైంది.
టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రెండేసి వికెట్ల చొప్పున తీయగా, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
