Chinmayi Sripada : మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మూడో నెలలోనే అబార్షన్ అయింది.. 37 ఏళ్ళ వయసులో తల్లి అయ్యాను..

చిన్మయి మాట్లాడుతూ.. ''నేను, రాహుల్‌ చాలా రోజులనుంచి పేరెంట్స్ అవ్వాలనుకున్నాం. 2020లోనే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేయాలనుకున్నాం. కానీ అప్పుడు కరోనాతో ఏం జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితిలో ఉన్నాం. మా డాక్టర్‌ కూడా బయట పరిస్థితులు బాగోలేవు...........

Chinmayi Sripada : మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మూడో నెలలోనే అబార్షన్ అయింది.. 37 ఏళ్ళ వయసులో తల్లి అయ్యాను..

Chinmayi Sripada shares her pregnency journey

Chinmayi Sripada :  ప్రముఖ సింగర్‌, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఇటీవల కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన భర్త నటుడు రాహుల్ రవీంద్రన్ తో కలిసి ఇటీవలే తన కవలపిల్లల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పిల్లలకి ద్రిప్త, శర్వాస్ అని పేర్లు కూడా పెట్టినట్టు తెలిపారు. తాజాగా చిన్మయి తన ప్రెగ్నెన్సీ జర్నీని ఓ వీడియో రూపంలో తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో చిన్మయి మాట్లాడుతూ.. ”నేను, రాహుల్‌ చాలా రోజులనుంచి పేరెంట్స్ అవ్వాలనుకున్నాం. 2020లోనే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేయాలనుకున్నాం. కానీ అప్పుడు కరోనాతో ఏం జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితిలో ఉన్నాం. మా డాక్టర్‌ కూడా బయట పరిస్థితులు బాగోలేవు, ఇన్ని రోజులు ఆగారు కదా, ఇంకొన్ని రోజులు ఆగండి అన్నారు.”

PV Sindhu : ప్రభాస్ నాకు బాగా క్లోజ్.. భవిష్యత్తులో హీరోయిన్ అవుతానేమో.. నా బయోపిక్ కచ్చితంగా ఉంటుంది..

”సెకండ్‌ వేవ్‌ అయ్యాక నేను మొదటిసారి ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ అనుకోని కారణాలు, ఆరోగ్య సమస్యలతో మూడు నెలలకే అబార్షన్‌ అయింది. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. మానసికంగా కూడా చాలా డిస్ట్రబ్‌ అయ్యాను. కొన్నిరోజుల తర్వాత నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెడిషనల్‌ చైనీస్‌ మెడికల్‌ డాక్టర్‌ ఎమిలీ అనే ఆవిడ పరిచయం అయ్యింది. తన సలహాలతో నేను డైట్‌, ఎక్సర్‌సైజ్‌ అన్నీ పాటించాను. అవన్నీ దాదాపు మన ఇండియన్‌ ఆయుర్వేదిక్‌ పద్దతులే. కొంతకాలానికి నేను మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను. ఇప్పుడు కవలలకు జన్మనిచ్చి 37ఏళ్ల వయసులో తల్లి అయ్యాను” అని తన ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేసుకుంది.