Bholaa Shankar: ఆ హీరో కోసం చిరు త్యాగం.. భోళాశంకర్ వాయిదా అందుకేనా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండో వారంలోకి అడుగుపెట్టినా, ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్ల‌బ్‌లో చేరి చిరు కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న చిరు, ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ భోళాశంకర్ మూవీ షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు.

Bholaa Shankar: ఆ హీరో కోసం చిరు త్యాగం.. భోళాశంకర్ వాయిదా అందుకేనా..?

Chiranjeevi Bholaa Shankar Release Postponed For Akhil Akkineni Agent Movie

Bholaa Shankar: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండో వారంలోకి అడుగుపెట్టినా, ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్ల‌బ్‌లో చేరి చిరు కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న చిరు, ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ భోళాశంకర్ మూవీ షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు.

Bholaa Shankar: మెగాస్టార్ మూవీ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందేనా..?

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతమేర జరుపుకోగా, ఇప్పుడు పూర్తిగా ఈ సినిమాకే సమయాన్ని కేటాయించేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 14న వేసవి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కానీ, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కానుండటంతో ఈ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. అయితే ఏప్రిల్ నెలలో భోళాశంకర్ చిత్రాన్ని రిలీజ్ వాయిదా వేయడం వెనుక మరో కారణం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Bholaa Shankar: పండగపూట మెగాస్టార్ మరో ట్రీట్.. భోళాశంకర్ వచ్చేది అందులోనే!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీ కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చూసినా, ఆ సమయంలో పలు సినిమాలు పోటీకి దిగుతున్నాయి. దీంతో ఏజెంట్ మూవీని ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, తన సినిమాను వాయిదా వేసి అఖిల్ ఏజెంట్ సినిమాకు లైన్ క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అఖిల్ ఏజెంట్ మూవీలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తారా లేక మళ్లీ వాయిదా వేస్తారా అనేది చూడాలి.