Godfather: సల్మాన్‌తో కలిసి చిందులేసేందుకు రెడీ అవుతోన్న మెగాస్టార్..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజాతో కలిసి ‘గాడ్‌ఫాదర్’ అనే మూవీని తెరకెక్కిస్తున్న...

Godfather: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజాతో కలిసి ‘గాడ్‌ఫాదర్’ అనే మూవీని తెరకెక్కిస్తున్న మెగాస్టార్, ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొనగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్చల్ చేస్తోంది.
Godfather: ఆగస్టు వార్.. సిద్ధమంటోన్న గాడ్‌ఫాదర్..?
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర చాలా కీలకంగా ఉండటమే కాకుండా ఓ పాటలో చిరుతో కలిసి సల్మాన్ కూడా చిందులేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెకేషన్లో ఉన్న మెగాస్టార్, ఈ నెలాఖరున తిరిగి రానున్నారు. ఇక వచ్చిన వెంటనే జూన్ మొదటివారంలో గాడ్‌ఫాదర్ సినిమా కోసం ఓ పాట షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో చిరుతో పాటు సల్మాన్ ఖాన్ కూడా పాల్గొంటాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ పాట ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది.
Godfather: చిరు.. సల్మాన్.. ప్రభుదేవా.. థమన్.. వాట్ ఏ కాంబినేషన్!
ఇక మలయాళ మూవీ లూసిఫర్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో గాడ్‌ఫాదర్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను ఆగస్టు నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌తో కలిసి చిరు చిందులేస్తే ఆ పాట ఎలా ఉండబోతుందా అని ఆడియెన్స్ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు.
- Maruthi : ప్రజారాజ్యం పార్టీకోసం పనిచేశాను.. డైరెక్టర్ గా ఫస్ట్ యాక్షన్ చెప్పింది చిరంజీవి గారికే..
- Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
- Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..
- Tollywood stars : ఆసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కూతురి పెళ్ళిలో స్టార్ల సందడి
- Mega 154 : సంక్రాంతికి కలుద్దాం అంటున్న మెగాస్టార్.. బాబీ డైరెక్షన్లో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ..
1Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
2Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
3Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
4Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
5Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
6Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
7TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
8Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
9Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
10Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ