Chiranjeevi:ఇబ్బంది పెట్టొద్దు.. పట్టించుకోండి ప్లీజ్.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

ఇండస్ట్రీలో అందరూ భారీ రెమ్యూనరేషన్లు తీసుకోవట్లేదని, నలుగురైదుగురు మాత్రమే హయ్యస్ట్‌ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు చిరంజీవి.

10TV Telugu News

Chiranjeevi: లవ్‌స్టోరీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో అందరూ భారీ రెమ్యూనరేషన్లు తీసుకోవట్లేదని, నలుగురైదుగురు మాత్రమే హయ్యస్ట్‌ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు చిరంజీవి. ఇండస్ట్రీ సాధక బాధకాలను సీఎంలు పట్టించుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. సినిమాలు చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో పడిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నలుగురైదుగురి గురించి అందర్నీ ఇబ్బంది పెట్టొద్దని సూచించారు చిరంజీవి.

హీరోలు, డైరెక్టర్లు బాగా సంపాదించుకుంటారని అనుకోవద్దని, ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా తీయాలంటే ఆలోచించాల్సి వస్తోందన్నారు చిరంజీవి. సినిమా ఇండస్ట్రీ విషయంలో కనికరం చూపాలని ఏపీ సీఎంను కోరుతున్నానని అన్నారు చిరంజీవి. మా సమస్యలకు పరిష్కారం చూపాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను వేడుకుంటున్నట్లు చెప్పారు చిరంజీవి. ఇబ్బందుల్లో ఉన్న ఇండస్ట్రీని ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు.

పార్క్‌హయత్‌లో లవ్‌స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన చిరంజీవి, సినిమావాళ్ల సమస్యలపై ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన లవ్‌స్టోరీ సెప్టెంబర్‌ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్‌ అవుతుండగా.. ముఖ్య అతిధులుగా చిరంజీవి, అమీర్‌ఖాన్‌ వచ్చారు.