Chiranjeevi : చిరంజీవి ట్రస్ట్ వెబ్ సైట్ లాంచ్ చేసిన రామ్ చరణ్.. మరింతమందికి సాయం..

చిరంజీవి ఎన్నో సేవల్ని చేస్తున్నారు. ఈ సేవల్ని మరింత విస్తరించడానికి, మరింతమందికి ఉపయోగపడటానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ని ఇవాళ లాంచ్

Chiranjeevi : చిరంజీవి ట్రస్ట్ వెబ్ సైట్ లాంచ్ చేసిన రామ్ చరణ్.. మరింతమందికి సాయం..

Chiru

Chiranjeevi :  గత 20 సంవత్సరాల నుంచి మెగాస్టార్ చిరంజీవి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సాయం చేశారు. ఇంకా చేస్తున్నారు. ఆ తరువాత ఐ, బ్లడ్ బ్యాంక్స్ పెట్టి ఎంతోమంది ప్రాణాలని కాపాడారు. గత సంవత్సరం కరోనా టైంలో కూడా ఎంతో మందికి ఆక్సీజన్ అందించి కాపాడారు. ఇలా చిరంజీవి ఎన్నో సేవల్ని చేస్తున్నారు. ఈ సేవల్ని మరింత విస్తరించడానికి, మరింతమందికి ఉపయోగపడటానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ని ఇవాళ లాంచ్ చేశారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్ ఆఫీసులో రామ్ చరణ్ ఈ వెబ్ సైట్ ని లాంచ్ చేశారు.

Manchu Vishnu : ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు నాకు అందలేదు: మంచు విష్ణు

ఈ సందర్భంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ… ఈ వెబ్ సైట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చిరంజీవి ట్రస్ట్ లో ఉన్న సేవల గురించి, బ్లడ్, ఐ బ్యాంకులో ఉన్న నిల్వల గురించి తెలుసుకొని సాయం పొందొచ్చు. డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని వచ్చి డొనేట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి వెయిట్ చేయనవసరం లేదు. సైట్ లో మీరు ఏ టైంలో ఏ రోజు రావాలనుకుంటే అప్పుడు స్లాట్ బుక్ చేసుకొని వచ్చి డొనేట్ చేయొచ్చు. ఎవరికైనా రక్త దానం, నేత్ర దానం కావాలన్నా ఇందులో రిక్వెస్ట్ పెడితే మేము త్వరగా రెస్పాండ్ అవుతాము. ప్రస్తుతం బ్లడ్, ఐ బ్యాంక్ మాత్రమే ఉంది. త్వరలో మిగిలిన అన్ని ఆర్గాన్స్ కి డొనేట్ చేసేలాగా అవయవ దానం కూడా మొదలు పెడతాము అని తెలిపారు. అంతే కాక మన ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో ఈ వెబ్ సైట్ లభ్యమవుతుంది. దేశమంతటా కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్స్ బ్రాంచ్ లు పెట్టె దిశగా ఆలోచిస్తున్నాము. మేము చేసే సేవా కార్యక్రమాలకి ఎవరన్నా వాలంటీర్లుగా రావాలన్న ఈ వెబ్ సైట్ లో అప్లై చేయొచ్చు అని తెలిపారు. 20 ఏళ్లుగా ఈ ట్రస్ట్ తరపున సేవ చేస్తున్నాము ఇక ముందు కూడా చేస్తూ ఉంటాము అని తెలిపారు.

Balakrishna : మరోసారి ఫ్యాక్షన్ సినిమాతో రాబోతున్న బాలయ్య బాబు

ఇదే వేదిక పై చిరంజీవి పర్సనల్ వెబ్ సైట్ ని కూడా లాంచ్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇందులో చిరంజీవి ఇప్పటిదాకా నటించిన సినిమాల వివరాలు, వాటికి సంబంధించిన ఫోటోలు, చిరంజీవి సినిమాల్లోని పాటలు, చిరంజీవి ఫోటోలు, చిరంజీవి చేసిన కార్యక్రమాలు, ఆయనకి వచ్చిన అవార్డులు, రివార్డులు అన్ని కూడా లభ్యమవుతాయి. అభిమానుల కోసం ప్రత్యేకంగా ఈ సైట్ ని రూపొందించినట్టు తెలిపారు.