Prabhas: ప్రభాస్-సుకుమార్ ప్రాజెక్ట్‌పై నిర్మాతల క్లారిటీ..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ సినిమాను కంప్లీట్ చేసిన ప్రభాస్, ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ‘మహానటి’ ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి ‘ప్రాజెక్ట్-K’ అనే సినిమాలోనూ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. అంతేగాక దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఓ హార్రర్ డ్రామా మూవీలోనూ ప్రభాస్ నటిస్తున్నాడు.

Prabhas: ప్రభాస్-సుకుమార్ ప్రాజెక్ట్‌పై నిర్మాతల క్లారిటీ..!

Clarity On Prabhas Sukumar Movie By Abhishek Agarwal Arts

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ సినిమాను కంప్లీట్ చేసిన ప్రభాస్, ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ‘మహానటి’ ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి ‘ప్రాజెక్ట్-K’ అనే సినిమాలోనూ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. అంతేగాక దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఓ హార్రర్ డ్రామా మూవీలోనూ ప్రభాస్ నటిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Prabhas: మరో స్టార్ డైరెక్టర్‌కు ఓకే చెప్పిన ప్రభాస్..?

సుకుమార్ ‘పుష్ప-2’ మూవీ తరువాత రామ్ చరణ్‌తో ఓ సినిమా చేస్తాడని.. ఆ సినిమా తరువాత ప్రభాస్‌తో ఓ భారీ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయబోతుందనే వార్త కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దీనిపై స్పందించింది.

తమ బ్యానర్లో రాబోయే సినిమాలకు సంబంధించి అన్ని విషయాలను తామే స్వయంగా ప్రకటిస్తామని.. అంతేగాని ఎలాంటి ఆధారాలు లేకుండా నెట్టింట వైరల్ అవుతున్న వార్తలను ప్రేక్షకులు పట్టించుకోవద్దంటూ సదరు నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో సుకుమార్-ప్రభాస్ కాంబోలో రాబోయే సినిమా కేవలం పుకారేనని తేలిపోయింది.