Parasuram Petla: మాస్‌లో క్లాస్ పరుశురాం.. ఎస్‌వీపీ మరో మెట్టు ఎక్కిస్తుందా? Class Director Parusuram Petla with mass angle.. Will Sarkaru Vaari Paata take another step?

Parasuram Petla: మాస్‌లో క్లాస్ పరుశురాం.. ఎస్‌వీపీ మరో మెట్టు ఎక్కిస్తుందా?

క్లాసీగా కనిపించే మాస్ సినిమాలు తీస్తాడు.. థియేటర్ కొచ్చే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇవ్వాలని తాపత్రాయపడుతాడు. కానీ కానీ సినిమా సినిమాకి డైరెక్టర్ పరశురామ్ లాంగ్ బ్రేక్ తీసుకుంటాడు.

Parasuram Petla: మాస్‌లో క్లాస్ పరుశురాం.. ఎస్‌వీపీ మరో మెట్టు ఎక్కిస్తుందా?

Parasuram Petla: క్లాసీగా కనిపించే మాస్ సినిమాలు తీస్తాడు.. థియేటర్ కొచ్చే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇవ్వాలని తాపత్రాయపడుతాడు. కానీ కానీ సినిమా సినిమాకి డైరెక్టర్ పరశురామ్ లాంగ్ బ్రేక్ తీసుకుంటాడు. ఎన్నో ఏళ్ల శ్రమ తర్వాత మహేశ్ బాబు లాంటి స్టార్ తో సర్కారు వారి పాట చూపించబోతున్నాడు. మరీ మూవీతో పరశురామ్ స్టార్ డైరెక్టర్ హోదా సాధిస్తాడా.. నెక్ట్స్ లెవెల్ కి వెళ్తాడా..?

Parasuram : నాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి అని మెసేజ్ పెట్టారు మహేష్

చాలా యంగ్ ఏజ్ లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం, ఆంధ్రావాలా, 143 లాంటి సినిమాలకి పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా.. పరుగు మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇక 2008లో నిఖిల్ హీరోగా చేసిన యువతతో దర్శకుడిగా స్ట్రెయిట్ ఎంట్రీ ఇచ్చాడు పరశురామ్. ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీతగోవిందం లాంటి సినిమాలను ప్రేక్షకులకు చూపించాడు.

Parasuram: మహేశ్ దర్శకుడి భారీ స్కెచ్.. ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్!

ఒక్కసారి పరశురామ్ లిస్ట్ పరిశీలిస్తే.. క్లాస్ సినిమాలున్నాయి.. మాస్ మూవీస్ కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే క్లాసీగా కనిపిస్తూనే మాస్ యాంగిల్ ప్రెజెంట్ చేస్తాయి. నిఖిల్, రవితేజ, నారా రోహిత్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలకు మంచి హిట్స్ ఇచ్చాడు తప్పించి మరీ రొడ్డకొట్టుడు కథలనైతే చెప్పలేదు. అయితే మహేశ్ బాబు లాంటి ఓ స్టార్ హీరోతో వర్క్ చేసే ఛాన్స్ మాత్రం ఇచ్చింది సర్కారు వారి పాటే.

Sarkaru Vaari Paata: మాంచి ఆకలి మీదున్న ఫ్యాన్స్.. రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్

సర్కారు వారి పాటతో తన డ్రీమ్ తీర్చుకున్నాడు పరశురామ్. గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేశ్ బాబును ఒప్పించి ఆయనకోసమే రాసుకున్న కథలో సూపర్ స్టార్ ను ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమా అనుకున్నట్టు బంపర్ హిట్ అయితే పరశురామ్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరడం ఖాయం.

Mahesh Babu: మాస్ అవతారమెత్తిన మహేష్ బాబు.. ఊగిపోతున్న ఫ్యాన్స్!

తనదైన రచనతో కట్టిపడేసే పరశురామ్ మహేశ్ బాబు లుక్, డైలాగ్ డెలివరీ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఫుల్ ఎనర్జిటిక్ రోల్ లో సూపర్ స్టార్ ను చూడబోతున్నామని ట్రైలర్ తోనే డిసైడయ్యారు ఫ్యాన్స్. మహేశ్ మేనరిజం, యాక్టింగ్, డాన్స్, వేరియేషన్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తారనే నమ్మకంతో ఉన్నాడు పరశురామ్. సో సర్కారు వారి పాట బాక్సాఫీస్ సునామీని సృష్టిస్తే పరశురామ్ టాప్ లీగ్ కి చేరుకోవడం సులభమే.

Sakaru Vaari Paata: యూట్యూబ్‌ను అల్లాడించేసిన మహేష్!

సినిమా సినిమాకి ల్యాగ్, గ్యాప్ ఎక్కువ తీసుకోవడం పరశురామ్ కెరీర్ లో కనపిస్తుంది. అయితే ఈసారి పెద్ద బ్రేక్ లేకుండా సినిమాను పట్టాలెక్కించేస్తున్నాడు. మహేశ్ తర్వాత నాగచైతన్యతో సినిమాను ప్లాన్ చేశాడు. 14 రీల్స్ బ్యానర్ లో నాగచైతన్యతో చేసే ప్రాజెక్ట్ త్వరలోనే లాంచ్ కానుంది. ఇప్పటికైతే సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్, రిలీజ్ ప్రమోషన్స్ తో హడావిడీ చేస్తోన్న పరశురామ్.. మే 12న అందరి లెక్కల్ని తీరుస్తా అంటున్నాడు.

×