Telangana: CMO హవా.. ట్విట్టర్‌లో ఎక్కువమంది ఫాలోవర్స్!

ప్రజలకు ఏ కష్టమొచ్చినా క్షణాల్లో సీఎం కార్యాలయానికి తెలియజేయొచ్చు. అవసరాన్ని బట్టి.. ఆయా శాఖల అధికారులు స్పందించి ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తారు.

Telangana: CMO హవా.. ట్విట్టర్‌లో ఎక్కువమంది ఫాలోవర్స్!

Telangana

Telangana: ప్రజలకు ఏ కష్టమొచ్చినా క్షణాల్లో సీఎం కార్యాలయానికి తెలియజేయొచ్చు. అవసరాన్ని బట్టి.. ఆయా శాఖల అధికారులు స్పందించి ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చేరువ కావడంతో తెలంగాణ సీఎం కార్యాలయం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది. 2020 ఏప్రిల్ 1 నుండి 2021 మార్చి 31 మధ్య సేకరించిన గణాంకాల ప్రకారం అటు ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగిన జాబితాలో సీఎం కేసీఆర్ కార్యాలయమే దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇక ఫేస్ బుక్ లో కూడా\ తెలంగాణ సీఎంఓ మూడో స్థానంలో నిలిచింది.

ప్రతి వెయ్యి జనాభాకు ఉన్న ఫాలోవర్ల ప్రాతిపదికన తెలంగాణ సీఎంఓ దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా.. ఫాలోవర్స్‌పరంగా గతేడాది మిలియన్‌ మైలు రాయిని దాటిన తెలంగాణ సీఎంఓ ట్విట్టర్‌ ఖాతాను ప్రస్తుతం 11.61 లక్షల మంది అనుసరిస్తున్నారు. రాష్ట్రంలోని 3.5 కోట్ల జనాభాకుగాను ప్రతి వెయ్యి మందిలో 33.18 మంది తెలంగాణ సీఎంవో ట్విట్టర్‌ ఖాతాను ఫాలో అవుతున్నట్లు అంచనా. ఇక మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ లోనూ ఎక్కువ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న సీఎంఓల జాబితాలో తెలంగాణ సీఎంఓ మూడవ స్థానంలో కొనసాగుతోంది.

ట్విట్టర్లో మొదటి స్థానంలో తెలంగాణ సీఎంఓ ఉంటే రెండవ స్థానంలో హర్యానా సీఎంఓ , మూడవ స్థానంలో మహారాష్ట్ర సీఎంఓ , నాలుగవ స్థానంలో ఒడిశా సీఎంఓ , ఐదవ స్థానంలో మధ్యప్రదేశ్ సీఎంఓ అకౌంట్స్ ఉన్నాయి. ఇక ఫేస్‌బుక్‌లో తొలి స్థానంలో రాజస్తాన్‌ సీఎంఓ ఉండగా రెండవ స్థానంలో కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది. మూడవ స్థానంలో తెలంగాణ, నాల్గవ స్థానంలో పంజాబ్, ఐదవ స్థానంలో మధ్యప్రదేశ్ సీఎం కార్యాలయాలున్నాయి.