Colour Photo: నేషనల్ అవార్డ్ రావడంపై కలర్ ఫోటో టీమ్ ప్రెస్ మీట్

తాజాగా అనౌన్స్ చేసిన 68వ జాతీయ ఫిలిం అవార్డ్స్‌లో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ ఎంపిక కావడంతో టాలీవుడ్ ప్రముఖులు కలర్ ఫోటో చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా తాజాగా కలర్ ఫోటో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.

Colour Photo: నేషనల్ అవార్డ్ రావడంపై కలర్ ఫోటో టీమ్ ప్రెస్ మీట్

Colour Photo Movie Team Press Meet On Recieving National Award

Colour Photo: తెలుగులో కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకాధరణ దక్కుతుంది. ఇదే విషయాన్ని 2020లో వచ్చిన ‘కలర్ ఫోటో’ సినిమా నిరూపించింది. ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన విధానం, ఈ సినిమాలో సుహాస్, చాందినీ చౌదిరీలు హీరోహీరోయిన్లుగా నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాను నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా అనౌన్స్ చేసిన 68వ జాతీయ ఫిలిం అవార్డ్స్‌లో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ ఎంపిక కావడంతో టాలీవుడ్ ప్రముఖులు కలర్ ఫోటో చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా తాజాగా కలర్ ఫోటో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు వంశీ పైడిపల్లి, ‘కలర్ ఫోటో’ చిత్ర యూనిట్‌తో పాటు ఆహా ప్రతినిధులు పాల్గొన్నారు.

‘ఆహా’ అనిపిస్తున్న ‘కలర్ ఫోటో’

ఆహా ప్రతినిధి వాసు మాట్లాడుతూ.. ‘‘ఇది అందరికీ గర్వపడే విషయం.. అల్లు అరవింద్ గారు కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చెయ్యాలి అని ‘అహా’ని స్టార్ట్ చేశారు. మంచి కంటెంట్‌తో వచ్చిన కలర్ ఫోటో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

ఇక ‘కలర్ ఫోటో’ చిత్ర దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్ తరువాత ఆహాలో రిలీజ్ అయ్యింది. చిన్నచిన్న ఊళ్లల్లో కూడా ఆహా వల్ల ఈ సినిమా అందరికీ రీచ్ అయ్యింది. జెన్యూన్‌గా తీస్తే అందరికీ నచ్చుతుందని ఈ సినిమా నిరూపించింది.’’ అని తెలిపారు. ఇక హిరో సుహాస్ మాట్లాడుతూ..‘‘ఫస్ట్ రాజేష్ నువ్వు హిరోగా చెయ్యాలి అన్నప్పుడు భయం వేసింది.. మంచి సినిమా… అవార్డ్ రావడం చాలా హ్యాపీగా వుంది..’’ అని అన్నాడు.

కాగా హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ..‘‘ఈ సినిమా నేషనల్ లెవెల్‌లో రికగ్నైజ్ అయినందుకు చాలా సంతోషంగా వుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. నా కెరీర్‌లో గుర్తిండిపోయే సినిమా కలర్ ఫోటో.’’ అని తెలిపింది. ఇక ఈ సినిమాలో ఓ పాత్రలో నటించిన నటి దివ్య మాట్లాడుతూ..‘‘నేను ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను.. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్‌కి థాంక్స్.. ప్రతి సినిమాకు అందరూ హార్డ్‌వర్క్ చేస్తారు.. కొంతమంది ఇష్టపడి పని చేస్తారు.’’ అంటూ తన సంతోషాన్ని తెలియజేసింది.

National Film Awards: నేషనల్ ఫిలిం అవార్డుల్లో ఆహా అనిపించిన తెలుగు సినిమాలు

ఇక ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన వైవ హర్ష మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చేస్తున్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్‌లు హానేస్ట్‌గా కృషి చేసారు.. ‘ఆహా’లో మంచి కంటెంట్ ఉంది. అక్రాస్ ఇండియా ఈ సినిమా ఆహా వల్ల రీచ్ అయ్యింది.’’ అంటూ తెలిపారు. కలర్ ఫోటో చిత్ర నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘‘నేను ముగ్గురు వ్యక్తులకు థాంక్స్ చెప్పాలి. మొదటి నుంచి నా వెనుకవున్న అరవింద్ గారికి, బన్నీ వాస్, ఎస్‌కే‌ఎన్‌కి థాంక్స్.. నేను థియేటర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తే ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు. ‘ఆహా’లో రిలీజ్ చెయ్యడం వల్ల అందరికీ రీచ్ అయ్యింది. దర్శకుడు వంశీ పైడిపల్లి సపోర్ట్ మరువలేనిది. ఈ సినిమా ఆహాలో రిలీజ్ అవ్వడాని కారణం వంశీగారే.. చిన్న సినిమా నేషనల్ అవార్డు గెలుచుకోవడంతో పెద్దవాళ్ళు అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.’’ అని అన్నారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ..‘‘సెలబ్రేషన్స్ తెచ్చిన సినిమా కలర్ ఫోటో.. నేషనల్ అవార్డ్ రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో ఆనందంగా ఫీలవుతుంది. సినిమాలో నటించిన అందరికీ థాంక్స్. అందరూ ఒక టీమ్ వర్క్‌తో హార్డ్‌వర్క్ చేసారు.. నేను క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. ‘ఆహా’కి థాంక్స్.. యూనిట్ అందరికీ థాంక్స్.. అలాగే తమన్‌కి నా అభినందనలు. కలర్ ఫోటో యూనిట్‌కు థాంక్స్.’’ అని అన్నారు.