CPI Narayana : బిగ్‌బాస్ పై కంప్లైంట్ చేశాను.. పూర్తిగా బ్యాన్ చేయాలి..

CPI నారాయణ మాట్లాడుతూ.. ''బిగ్‌బాస్ కార్యక్రమంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను. యువతను పెడదారి పట్టిస్తున్న బిగ్‌బాస్ కార్యక్రమాన్ని నిషేధించాలని గతంలోనే............

CPI Narayana : బిగ్‌బాస్ పై కంప్లైంట్ చేశాను.. పూర్తిగా బ్యాన్ చేయాలి..

Biggboss

BiggBoss :  తెలుగులో ఇప్పటికే అయిదు సీజన్లు పూర్తి చేసుకొని ఆరో సీజన్ ని ఓటీటీలో టెలికాస్ట్ చేస్తుంది బిగ్‌బాస్. బిగ్‌బాస్‌ హౌస్ లో కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలని 100 రోజులు ఉంచి రకరకాల టాస్కులని ఇస్తూ ఉంటారు. దీంతో ఈ షోపై గతంలోనూ చాలా అభ్యంతరాలు ఎదురయ్యాయి. ఈ షోని ఆపేయ్యాలంటూ చాలా మంది ప్రముఖులు గతంలోనే మాట్లాడారు. బిగ్‌బాస్‌ లో కొన్ని టాస్కులు శృతి మించి ఉండటమే కాకుండా, కంటెస్టెంట్స్ మధ్య ముద్దులు, కౌగలింతలు, ఒకరి మీద ఒకరు పడుకోవడం, కూర్చోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి. షో రేటింగ్ కోసం ఇలాంటివే ఎక్కువగా చూపిస్తున్నారు. ఇవన్నీ గత సీజన్ల నుంచి జరుగుతూనే వస్తున్నాయి. వీటివల్ల సమాజం చెడిపోతుందని, యువత తప్పుదారి పడుతుందని గతంలో పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు. దీనిపై కొంతమంది పోలీసులకి కంప్లైంట్ చేయడం, కోర్టులో కేసు వేయడం జరిగింది.

ఇటీవల బిగ్‌బాస్ పై ఏపీ హైకోర్టు మాట్లాడుతూ ఇలాంటి షోలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తాయని, వాటిని ఆపేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. బిగ్‌బాస్ ని ఆపేయాలంటూ వచ్చిన పిటిషన్ ని హైకోర్టు సోమవారం(మే 3న) విచారించనుంది. హైకోర్టు బిగ్‌బాస్ పై వ్యాఖ్యలు చేయడంతో తాజాగా CPI నారాయణ మరోసారి బిగ్‌బాస్ ని బ్యాన్ చేయాలంటూ మీడియాతో మాట్లాడారు.

Siddarth : పాన్ ఇండియా అనేది ఒక నాన్సెన్స్.. హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు..

CPI నారాయణ మాట్లాడుతూ.. ”బిగ్‌బాస్ కార్యక్రమంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను. యువతను పెడదారి పట్టిస్తున్న బిగ్‌బాస్ కార్యక్రమాన్ని నిషేధించాలని గతంలోనే నేను హైదరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. బిగ్‌బాస్ షోని పూర్తిగా బ్యాన్‌ చేసే బాధ్యత హైకోర్టు తీసుకోవాలని కోరుతున్నాను” అని అన్నారు. మరి బిగ్‌బాస్ బ్యాన్ చేయాలన్న పిటిషన్ ఇవాళ విచారణకి రానుంది. దీనిపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.