Dhanush: ధనుష్ మాస్టార్ నా మనసును గెలిచారు అంటున్న సంయుక్తా మీన‌న్‌..

తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళంలో తెరకెక్కతున్న బైలింగ్వల్ చిత్రం 'సార్'. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక మూవీ టీం సినిమా ప్రమోషన్స్ ఇప్పటి నుంచే మొదలుపెట్టేసింది. ఇటీవల సినిమా టీజర్ ని విడుదల చేయగా, ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ధనుష్ జూనియర్ లెక్చరర్ పాత్రలో కొత్తగా కనిపిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంభందించిన...

Dhanush: ధనుష్ మాస్టార్ నా మనసును గెలిచారు అంటున్న సంయుక్తా మీన‌న్‌..

Dhanush Sir Movie First Single Out Now

Dhanush: తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళంలో తెరకెక్కతున్న బైలింగ్వల్ చిత్రం ‘సార్’. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక మూవీ టీం సినిమా ప్రమోషన్స్ ఇప్పటి నుంచే మొదలుపెట్టేసింది. ఇటీవల సినిమా టీజర్ ని విడుదల చేయగా, ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ధనుష్ జూనియర్ లెక్చరర్ పాత్రలో కొత్తగా కనిపిస్తున్నాడు.

Dhanush Sir Movie: సార్ రిలీజ్ డేట్ లాక్ చేసారు!

తాజాగా ఈ చిత్రానికి సంభందించిన తొలి గీతని ఈరోజు విడుదల చేసింది చిత్ర యూనిట్. “మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నే కలగన్నట్టే, నా పక్కన నిలిచారు” అంటూ సాగే ఈ గీతానికి తమిళంలో ‘ధనుష్‘, తెలుగులో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించటం విశేషం. తమిళ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ స్వరాలు అందించగా, శ్వేతామోహన్ గానం చేసింది.

ఈ సినిమాలో సంయుక్తా మీన‌న్‌, ధనుష్ కి జంటగా నటిస్తుంది. విడుదలయిన లిరికల్ సాంగ్ లో వీరిద్దరి మధ్య జరిగే లవ్ సీన్స్ అందర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చదువుని వ్యాపారం చేసి అమ్ముతున్న సమాజాన్ని ప్రశ్నించేలా ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు టీజర్ లో తెలుస్తుంది.