Dhanush Sir Movie : కొంచెం లేటుగా వస్తానంటున్న ‘సార్’..
తమిళ స్టార్ హీరో ధనుష్ వరుసగా తెలుగు దర్శకులను లైన్ లో పెడుతున్నాడు. తెలుగు లవ్ స్టోరీ స్పెషలిస్ట్స్ శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి.. ధనుష్ తో సినిమాకు సైన్ చేయగా, ఇందులో వెంకీ ఆల్తూరి మూవీ దాదాపు షూటింగ్ పూర్తీ చేసేసుకుంది. కాగా తొలుత ఈ సినిమాని డిసెంబర్ 2న విడుదల చేస్తామని ప్రకటించగా, తాజాగా ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేస్తూ...

Dhanush Sir Movie Release date postponed
Dhanush Sir Movie : తమిళ స్టార్ హీరో ధనుష్ వరుసగా తెలుగు దర్శకులను లైన్ లో పెడుతున్నాడు. తెలుగు లవ్ స్టోరీ స్పెషలిస్ట్స్ శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి.. ధనుష్ తో సినిమాకు సైన్ చేయగా, ఇందులో వెంకీ ఆల్తూరి మూవీ దాదాపు షూటింగ్ పూర్తీ చేసేసుకుంది. బైలింగ్వల్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ‘సార్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ అండ్ ఫస్ట్ సింగల్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
Dhanush: ధనుష్ మాస్టార్ నా మనసును గెలిచారు అంటున్న సంయుక్తా మీనన్..
ధనుష్ తన కెరీర్ లో మొదటిసారి పాఠాలు చెప్పే మాస్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కాగా తొలుత ఈ సినిమాని డిసెంబర్ 2న విడుదల చేస్తామని ప్రకటించగా, తాజాగా ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. 2023 ఫిబ్రవరి 17న సినిమా విడుదల చేస్తున్నట్లు కొత్త పోస్టర్ ని అధికారికంగా విడుదల చేసింది చిత్ర యూనిట్.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ధనుష్ కు మొదటి స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్. ఇక టీజర్ బట్టి చూస్తే.. చదువుని వ్యాపారం చేసి అమ్ముతున్న సమాజాన్ని ప్రశ్నించేలా ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీ ధనుష్ కి తెలుగులో మొదటి విజయాన్ని అందించగలదో లేదో చూడాలి.

Dhanush Sir Movie Release date postponed

Dhanush Sir Movie Release date postponed