Telugu Movies : సినిమాల రిలీజ్ డేట్స్‌ పై దిల్‌రాజు ప్రెస్‌మీట్

ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ..''ఫిబ్రవరి ఎండింగ్ నుంచి సినిమాల రిలీజ్ లు ఉంటాయి. నిర్మాతలందరం డేట్స్ సరిచూసుకుని సినిమాలను విడుదల చేస్తాము. సమ్మర్ లోపు పెద్ద సినిమాలన్నీ..

Telugu Movies : సినిమాల రిలీజ్ డేట్స్‌ పై దిల్‌రాజు ప్రెస్‌మీట్

Dil Raju

Dil Raju :  కరోనా థర్డ్ వేవ్ కారణంగా, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఇటీవల చాలా రాష్ట్రాల్లో థియేటర్స్ మూత పడ్డాయి. చాలా రాష్ట్రాల్లో 50 శాతంతో థియేటర్లు నడుస్తున్నాయి. దీంతో పెద్ద సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘భీమ్లానాయక్’ ఆచార్య లాంటి పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా వాయిదా పడ్డాయి. మన తెలుగులోనే కాక తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదాపడ్డాయి.

స్టార్ హీరోలంతా దేశ వ్యాప్తంగా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా, తమ సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలా అని ఎదురు చూస్తున్నారు. అభిమానులు కూడా తమ హీరోల సినిమాల కోసం అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా పెద్ద సినిమాల రిలీజ్ లపై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు.

Lakshmi Pranathi : సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ భార్య ప్రణతి.. లవ్లీ హస్బెండ్ అంటూ ఫస్ట్ పోస్ట్..

ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ”ఫిబ్రవరి ఎండింగ్ నుంచి సినిమాల రిలీజ్ లు ఉంటాయి. నిర్మాతలందరం డేట్స్ సరిచూసుకుని సినిమాలను విడుదల చేస్తాము. సమ్మర్ లోపు పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. ఈ లోపు టికెట్ రేట్ల ఇష్యూ కూడా సాల్వ్ అవ్వొచ్చు” అని తెలిపారు. దీంతో ఈ సారి సమ్మర్ బరిలో పెద్ద సినిమాలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని సినిమాలు సమ్మర్ కి రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశాయి.