ఇస్మార్ట్ శంకర్ – దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్.. 'ఇస్మార్ట్ శంకర్'.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. నుండి 'దిమాక్ ఖరాబ్' వీడియో సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : September 20, 2019 / 09:59 AM IST
ఇస్మార్ట్ శంకర్ – దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘ఇస్మార్ట్ శంకర్’.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. నుండి ‘దిమాక్ ఖరాబ్’ వీడియో సాంగ్ రిలీజ్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘ఇస్మార్ట్ శంకర్’.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. నిధి అగర్వాల్‌, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా జూలై 18న విడుదలై.. పాజిటివ్ టాక్‌తో పాటు, మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది.

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్‌లో రామ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇటీవలే థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుందీ సినిమా.. రీసెంట్‌గా ఈ సినిమా నుండి ‘దిమాక్ ఖరాబ్’ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..

పక్కా మాస్ మసాలా, డీజే స్టైల్‌లో స్వరబ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన బీట్‌కి తగ్గట్టు, రామ్ ఫుల్ ఎనర్జిటిక్‌గా, చాలా ఈజ్‌తో వేసిన స్టెప్స్‌కి థియేటర్స్‌లో విజిల్స్ పడ్డాయి. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్‌ కొరియోగ్రఫీ చేసాడు.. సంగీతం : మణిశర్మ, కెమెరా : రాజ్ తోట, ఎడిటింగ్ : జునైద్ సిద్ధికీ, ఆర్ట్ : జానీ షేక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విషు రెడ్డి, నిర్మాణం : పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్..