Chiranjeevi : మీ బోడి పెర్ఫార్మన్స్ నా దగ్గరొద్దంటూ చిరంజీవి గారు కుర్చీ విసిరేశారు.. డైరెక్టర్ బాబీ!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకోవడంతో థియేటర్ల వద్ద మెగా జాతర జరుగుతుంది. ఇక సినిమా సూపర్ సక్సెస్ అందుకోవడంతో చిత్ర యూనిట్ ఇటీవల సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఫంక్షన్ లో దర్శకుడు బాబీ మాట్లాడుతూ చిరంజీవికి కోపం వచ్చిన సంఘటన గురించి తెలియజేశాడు.

Chiranjeevi : మీ బోడి పెర్ఫార్మన్స్ నా దగ్గరొద్దంటూ చిరంజీవి గారు కుర్చీ విసిరేశారు.. డైరెక్టర్ బాబీ!

chiranjeevi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకోవడంతో థియేటర్ల వద్ద మెగా జాతర జరుగుతుంది. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో రవితేజ కూడా నటించాడు. చిరంజీవికి తమ్ముడిగా రవితేజ నటించాడు. ఇక సినిమా సూపర్ సక్సెస్ అందుకోవడంతో చిత్ర యూనిట్ ఇటీవల సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఫంక్షన్ లో దర్శకుడు బాబీ మాట్లాడుతూ చిరంజీవికి కోపం వచ్చిన సంఘటన గురించి తెలియజేశాడు.

Chiranjeevi : తన వాయిస్ తో ప్రత్యేక వీడియో.. వాల్తేరు వీరయ్య విజయాన్ని సినీ కార్మికులకు అంకితమిచ్చిన మెగాస్టార్..

గతంలో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను సెట్స్ కి వెళ్ళాను. షాట్ కి టైం అవ్వడంతో మేనేజర్ చిరంజీవి గారిని పిలవడానికి వెళ్ళాడు. అయితే ఆ సమయంలో చిరంజీవి గారు టిఫిన్ చేస్తూ ఉన్నారు. దీంతో ఆయనని పిలవడానికి మేనేజర్ బయపడుతుంటే, విషయం తెలుసుకున్న చిరంజీవి గారు కుర్చీ విసిరేసి ఆ మేనేజర్ ని తిట్టారు. నాకు టిఫిన్ కంటే షాట్ ఇంపార్టెంట్. మీ బోడి పెర్ఫార్మన్స్ లు నా దగ్గర చేయకండి అంటూ కోపడ్డారు. అప్పుడు ఆయన కోపం చూసిన నాకు ఒకటి అర్ధమైంది.. ఆయనకి ఇబ్బంది కలిగిన పరవాలేదు సినిమాకి ఇబ్బంది కలిగితే మాత్రం కోపం వస్తుంది అని తెలిసింది.

ఆ భయంతోనే వాల్తేరు వీరయ్య సినిమాలో ఎటువంటి లాస్ జరగకుండా చూసుకున్నాను అంటూ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనని చెప్పుకొచ్చాడు. సినిమాలోనే ఒక ఫైట్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ ని వేసాం. అయితే ఫైట్ మాస్టర్ డేట్స్ అయ్యిపోవడంతో ఆయన వేరే ఊరు వెళ్లిపోతున్నారు. మాస్టర్ తిరిగి రావడానికి 10 రోజులు పడుతుంది. అప్పటివరకు సెట్ అలాగే ఉంచడంతో ఖర్చు పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఈ విషయాన్ని చిరంజీవి గారితో చెప్పను. నిర్మాతకి ఖర్చు పెరగ కూడదని.. మధ్యాహ్నం వరకు పూనకాలు లోడింగ్ సాంగ్ లో నటించి, మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఫైట్ సీక్వెన్స్ లో నటించి కంప్లీట్ చేశారు అంటూ తెలియజేశాడు.