Mahesh Babu : మహేష్ బాబు సినిమా రిలీజ్ కోసం సుకుమార్ భార్య వెయిటింగ్.. ఏ మూవీ తెలుసా?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబిత మహేష్ బాబు సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. అది ఏ సినిమానో తెలుసా?

Mahesh Babu : మహేష్ బాబు సినిమా రిలీజ్ కోసం సుకుమార్ భార్య వెయిటింగ్.. ఏ మూవీ తెలుసా?

Director Sukumar wife waiting for mahesh babu 1 Nenokkadine re release

Mahesh Babu : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కించే బిజీలో ఉన్నాడు. కాగా సుకుమార్ సతీమణి తబిత మహేష్ బాబు సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. అయితే అది కొత్త సినిమా కాదండోయ్, పాత సినిమా రీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మహేష్, సుకుమార్ కలయికలో వచ్చిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 1 నేనొక్కడినే (1 Nenokkadine). 2014 లో భారీ అంచనాలు మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.

SSMB28 : షూటింగ్ సెట్ నుంచి మహేష్, పూజా పిక్ లీక్.. వైరల్!

హాలీవుడ్ రేంజ్ లో సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కించగా స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి అర్ధంకాక పోవడంతో సక్సెస్ ని అందుకోలేక పోయింది. అయితే ఈ సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే.. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఉందని సుకుమార్ ని ఈ సినిమాని రీ రిలీజ్ చేయమని తన వైఫ్ తబిత కోరారట. ఇటీవల ప్లాప్ మూవీ ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ కాగా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే 1 నేనొక్కడినే సినిమాని కూడా ఇప్పుడు ఆదరిస్తారా? లేదా ప్లాప్ గానే మిగులుతుందా? అనే క్యూరియాసిటీతో తబిత, సుకుమార్ ని కోరినట్లు సమాచారం.

SSMB 28 : డ్యూయల్ రోల్ లో మహేశ్.. త్రివిక్రమ్ – మహేశ్ సినిమా SSMB28 కూడా పాన్ ఇండియానా??

ఈ సినిమాతో పాటు మరో మూవీ కూడా రీ రిలీజ్ అయితే చూడాలని ఉందట. సుకుమార్ దర్శకత్వంలో రామ్ (Ram Pothineni) హీరోగా తెరకెక్కిన జగడం సినిమా కూడా ప్లాప్ గా నిలిచింది. ఈ యాక్షన్ ఫిలిం కూడా రీ రిలీజ్ అయితే హిట్ చేస్తారా? ప్లాప్ చేస్తారా? అని తెలుసు కోవాలనుకుంటున్నారట. మరి ఈ రెండు సినిమాలు ఎప్పుడు రీ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వస్తాయో, ఎలాంటి రిజల్ట్ ని చూస్తాయో చూడాలి.