వీడు మామూలు ‘డర్టీ ఫెలో’ కాదండోయ్.. ట్రైలర్ మామూలుగా లేదు మరి!

  • Published By: sekhar ,Published On : July 18, 2020 / 12:42 PM IST
వీడు మామూలు ‘డర్టీ ఫెలో’ కాదండోయ్.. ట్రైలర్ మామూలుగా లేదు మరి!

ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాత ఎం.ఎస్. రాజు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ట్రెండీ ఫిల్మ్ ‘డర్టీ హరి’. ఈ చిత్రాన్ని ఎస్.పి.జి. క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మించారు. ‘డర్టీ హరి’లో శ్రవణ్ రెడ్డి హీరో. సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ నాయికలు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదల చేశారు.

Dirty Hari

సునీల్ వాయిస్ ఓవర్‌తో సాగే ఈ ట్రైలర్ యూత్‌ని ఆకట్టుకునేలా ఉంది. డ్రింక్, జాయింట్ కొట్టడం, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం ఎక్కువగా చూపించారు ట్రైలర్‌లో.. ఎం.ఎస్.రాజ్ కంప్లీట్‌గా యూత్ ఆడియెన్స్‌ని టార్గెట్ చేసి ‘డర్టీ హరి’ సినిమా చేశాడనిపిస్తోంది. ఫ్రెండ్, హీరోకి ఐదు రూల్స్ ఫాలోఅవమని చెప్పడం, అతను ఫాలో కాకపోవడం, బాస్ కూతురి దగ్గరినుండి బెస్ట్ ఫ్రెండ్ లవర్ వరకు అందరితోనూ రొమాన్స్‌లో రెచ్చిపోవడం.. ఇలా సాగిపోతుంది ‘డర్టీ హరి’ ట్రైలర్.. Visuals, RR బాగున్నాయి.

Dirty Hari

మనం నిత్యం కలిసే మనుషుల్లో దాగి ఉండే ఆటవికత్వం, విచక్షణారాహిత్యం వంటి అంశాల చుట్టూ కథ నడుస్తుందని, కఠోరమైన వాస్తవాలను అంతే సున్నితంగా ఎం.ఎస్. రాజు తెరకెక్కించారని, చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతూనే కథలో వినోదాన్ని కూడా అద్భుతంగా మేళవించారని చిత్రయూనిట్ తెలుపుతుంది.
సాంకేతిక నిపుణులు:
సంగీతం : మార్క్ కే రాబిన్
ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్
డీఓపీ: ఎం.ఎన్ .బాల్ రెడ్డి
ఎడిటర్: జునైద్ సిద్ధిఖి
సమర్పణ: గూడూరు శివరామకృష్ణ,
నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్.