Satyabhama : కాజల్ ‘సత్యభామ’ నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది.. కళ్లారా చూశాలే..

కాజల్ 'సత్యభామ' నుంచి కళ్లారా చూశాలే అంటూ సాగే రొమాంటిక్ లవ్ మెలోడీ సాంగ్ ని నేడు రిలీజ్ చేసారు.

Satyabhama : కాజల్ ‘సత్యభామ’ నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది.. కళ్లారా చూశాలే..

Kallara Lyrical Song released from Kajal Aggarwal Naveen Chandra Satyabhama movie

Satyabhama : కాజల్ అగర్వాల్ తన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘సత్యభామ’ని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసి సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేసారు. ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ‘కళ్లారా చూశాలే’ అంటూ సాగే రొమాంటిక్ లవ్ మెలోడీ సాంగ్ ని నేడు రిలీజ్ చేసారు.

Also read : Mahesh Babu : మహేష్ బాబు అభిబస్ కొత్త యాడ్స్ చూశారా? రాజేంద్రప్రసాద్ తో కలిసి..

శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ పాటకి రాంబాబు గోశాల లిరిక్స్ అందించగా శ్రేయా ఘోషల్ పాడారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర మేల్ లీడ్ చేస్తున్నారు. ఇక ఈ పాటలో కాజల్ అండ్ నవీన్ చంద్ర మధ్య వచ్చే లవ్ సీన్స్ చూపించారు. పాట అయితే వినడానికి, చూడడానికి చాలా బాగుంది.

కాగా ఈ సినిమా కాజల్ కెరీర్ లో 60వ చిత్రంగా వస్తుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సుమన్ చిక్కాల డైరెక్ట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 17న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసారు.