FACT CHECK : కరోనా కపూర్ ని కలిసిన ఫ్రిన్స్ ఛార్లెస్

  • Published By: veegamteam ,Published On : March 26, 2020 / 10:21 AM IST
FACT CHECK : కరోనా కపూర్ ని కలిసిన ఫ్రిన్స్ ఛార్లెస్

కరోనా సోకిన బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ ప్రస్తుతం లక్నోలో ట్రీట్మెంట్ పొందుతుంది. ఇటీవల కనికా… లండన్ నుంచి తిరిగివచ్చిన విషయం దాచిపెట్టి, పలు పార్టీలకు హాజరై,పలువురు ప్రముఖులను కలవడం,కనికాకు పాజిటివ్ అని తేలడంతో వారందరూ ఐసొలేట్ అవడం కొద్ది రోజుల కిందట హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలు పాటించనుందుకు ఆమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

అయితే బుధవారం(మార్చి 25, 2020)బ్రిటన్ రాజవంశీయుడు, ప్రిన్స్ చార్లెస్ కి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దాంతో ఇప్పుడు కనికా ఆయనతో కలిసిన దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల లండన్ పర్యటన సమయంలో ఛార్లెస్ ను కనికా కలిసినట్లు సోషల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి.

దీనికి సంబంధించిన ఫొటోలు అంటూ  కొన్ని ఛార్లెస్,కనికా కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలలో కనికా… చార్లెస్ తో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. యూపీ టు యూకే కరోనా వచ్చిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొంతమంది మీరు త్వరగా కోలుకొవాలని ఆశిస్తున్నాం అంటూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

అయితే, ఆ ఫోటోలు ఇప్పటివి కావు. 2015, 2018 లో ప్రిన్స్ చార్లెస్ నిర్వహించిన ట్రావెల్స్ టు మై ఎలిఫెంట్స్, బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్ 10వ వార్షికోత్సవం సమయంలో కనికా చార్లెస్ తో కలిసిన దిగిన ఫోటోలే ఇప్పుడు ఇటీవల లండన్ పర్యటన సమయంలో ఛార్లెస్ ను కనికా కలిసినట్లు సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫొటోలు. 

Also Read | పాక్ కుట్ర….కరోనా పేషెంట్లను సైలెంట్ గా POKకు తరలింపు