Birju Maharaj : ప్రపంచ ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూత

 ప్రపంచ ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు, కొరియోగ్రాఫర్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.......

Birju Maharaj : ప్రపంచ ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూత

Birju Maharaj

Birju Maharaj :   ప్రపంచ ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు, కొరియోగ్రాఫర్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బిర్జూ మహారాజ్.. తన మామ దగ్గర కథక్ నృత్య శిక్షణ తీసుకొని డ్యాన్సర్ గా మొదలుపెట్టారు. మొదటిసారి ఆయన సోలోగా బెంగాల్‌లోని మన్మథ్ నాథ్ ఘోష్ ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చారు. ఇక అప్పటి నుండి వరుస ప్రదర్శనలు ఇస్తూ వెనక్కి తిరిగి చూడకుండా కెరీర్ కొనసాగించారు.

ఆయన కెరీర్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించారు. అంతేకాక సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాస్ సమ్మాన్, నృత్య చూడామణి, ఆంధ్రరత్న, నృత్య విలాస్, ఆదర్శ శిఖర్ సమ్మాన్, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, శిరోమణి సమ్మాన్, రాజీవ్ గాంధీ శాంతి పురస్కారం… ఇలా చాలా అవార్డులు బిర్జు మహారాజ్ అందుకున్నారు. కమల్ హాసన్ ‘విశ్వరూపం’ చిత్రంలో ఆయన నృత్యానికి గాను నేషనల్ అవార్డు సాధించారు. ఇలా చాలా అవార్డులు ఆయన జీవితంలో సాధించారు.

Samantha : ఫ్యామిలీమ్యాన్ డైరెక్టర్స్‌తో మరో సిరీస్‌కి ఓకే చెప్పిన సమంత

కథక్ డ్యాన్సర్‌గానే కాకుండా శాస్త్రీయ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్, కవి, డ్రమ్మర్‌గా కూడా బిర్జు మహారాజ్ పేరు సంపాదించారు. బాలీవుడ్ లో దేవదాస్, దేద్ ఇష్కియా, ఉమ్రావ్ జాన్, బాజీ రావ్ మస్తానీ లాంటి ఎన్నో హిట్ సినిమాలకి నృత్య దర్శకత్వం వహించారు. సత్యజిత్ రే చిత్రం ‘చెస్ కే ఖిలాడీ’కి సంగీతం కూడా అందించారు.

Dimple hayathi : రవితేజ ‘ఖిలాడీ’ భామ డింపుల్ హయాతికి కరోనా

నృత్యకారుడిగా, నృత్య దర్శకుడిగా దేశానికి, కళా రంగానికి ఎన్నో సేవలు అందించిన పండిట్ బిర్జు మహారాజ్‌‌ మరణించారని తెలిసి అన్ని సినీ పరిశ్రమల ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు.