Galla Ashok : రాడిసన్ ఘటనపై స్పందించిన మహేష్ మేనల్లుడు

రాడిసన్ ఘటనపై గలా అశోక్ మాట్లాడుతూ.. ''పబ్‌ ఇష్యూలో నా పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ రోజు నేను ఫిజియోథెరపీ చేయించుకుని ఇంట్లోనే ఉన్నాను. ఎవరో నాకు ట్విటర్‌ లింక్‌ పంపితే.........

Galla Ashok : రాడిసన్ ఘటనపై స్పందించిన మహేష్ మేనల్లుడు

Galla Ashok

Galla Ashok :  ఇటీవల సమయం దాటిన తర్వాత కూడా పబ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో బంజారాహిల్స్ రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నిర్వహిస్తున్న ఫుడింగ్‌ మింగ్‌ పబ్‌పై పోలీసులు రైడ్‌ చేశారు. ఆ సమయంలో అక్కడికి పోలీసులు వెళ్లేసరికి దాదాపు 150 మంది యువతీ యువకులు పార్టీలు చేసుకుంటున్నారు. అయితే అక్కడ డ్రగ్స్ కూడా బయటపడటంతో పబ్‌ నిర్వాహకులతో పాటు 150 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంట్లో చాలా మంది ప్రముఖుల పిల్లలు కూడా ఉండటంతో ఈ వార్త సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో పేర్లు వినిపించిన సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు కొంతమంది దీనిపై స్పందించారు.

మొదట ఈ ఘటనలో మహేష్ మేనల్లుడు, గల్లా జయదేవ్ పెద్దకొడుకు, హీరో గల్లా అశోక్ పేరు కూడా వినపడింది. అయితే ఆ తర్వాత అది అశోక్ తమ్ముడు గల్లా సిద్దార్థ్ అని అంటున్నారు. ఇప్పటికే దీనిపై గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. కావాలనే మా పేర్లు చెప్తున్నారు, ఈ ఘటనపై మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు అని తెలిపారు. తాజాగా ఈ ఘటనపై గల్లా అశోక్ కూడా మాట్లాడారు. ఇవాళ ఏప్రిల్ 5న గల్లా అశోక్ పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాడిసన్ ఘటనపై స్పందించారు.

Naatu Naatu : అనిల్ రావిపూడితో కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులేసిన రాజమౌళి

రాడిసన్ ఘటనపై గలా అశోక్ మాట్లాడుతూ.. ”పబ్‌ ఇష్యూలో నా పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ రోజు నేను ఫిజియోథెరపీ చేయించుకుని ఇంట్లోనే ఉన్నాను. ఎవరో నాకు ట్విటర్‌ లింక్‌ పంపితే చూసి షాకయ్యాను. అప్పుడు అనిపించింది సెలబ్రిటీల లైఫ్స్‌ ఇలానే ఉంటాయా, అనవసరంగా వార్తల్లో పేర్లు రాస్తారా అని” అన్నారు.