Gangleader: ఫైనల్‌గా ‘గ్యాంగ్‌లీడర్’ రీప్రింట్ రెడీ!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ ఆయన కెరీర్‌లో ఎలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో మెగాస్టార్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు అప్పట్లో నీరాజనాలు పలికారు.

Gangleader: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ ఆయన కెరీర్‌లో ఎలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో మెగాస్టార్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు అప్పట్లో నీరాజనాలు పలికారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్‌లీడర్ మూవీ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!
ఇక ఈ సినిమాకు నేటికీ బుల్లితెరపై అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేకర్స్ ఈ మేరకు ‘గ్యాంగ్ లీడర్’ మాస్టర్ రీప్రింట్‌ను తయారు చేశారు. ఇటీవల రీ-రిలీజ్ చిత్రాల జోరు సాగుతుండటంతో, పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘గ్యాంగ్ లీడర్’ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
30 ఏళ్ల తర్వాత కలుసుకున్న‘గ్యాంగ్ లీడర్’ బ్రదర్స్..
ఈ సినిమాలో మెగాస్టార్ సరసన అందాల భామ విజయశాంతి హీరోయిన్‌గా నటించగా, బప్పీ లహరి సంగీతం ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక ఈ సినిమాను మార్చి 4న రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర మేకర్స్ రెడీ అవుతున్నారు.