Sourav Ganguly: బయోపిక్‌కు దాదా గ్రీన్ సిగ్నల్‌.. హీరోగా రణబీర్!

బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్స్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. సినీ సెలబ్రిటీల నుండి క్రీడాకారుల వరకు అందరి జీవితాలు ఇప్పుడు వెండితెరమీదకి వచ్చేస్తున్నాయి. క్రీడాకారులలో ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, మహమ్మద్ అజారుద్దీన్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్స్ వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు చేశాయి.

Sourav Ganguly: బయోపిక్‌కు దాదా గ్రీన్ సిగ్నల్‌.. హీరోగా రణబీర్!

Sourav Ganguly

Sourav Ganguly: బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్స్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. సినీ సెలబ్రిటీల నుండి క్రీడాకారుల వరకు అందరి జీవితాలు ఇప్పుడు వెండితెరమీదకి వచ్చేస్తున్నాయి. క్రీడాకారులలో ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, మహమ్మద్ అజారుద్దీన్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్స్ వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఇక ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ రానుంది.

నిజానికి చాలాకాలంగా పలువురు దాదా బయోపిక్ తెరకెక్కించేందుకు ఆసక్తి చూపించారు. కానీ అందుకు ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే.. ఇప్పుడు ఓ నిర్మాణ సంస్థకు ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు స్వయంగా గంగూలీనే చెప్పారు. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో.. బాలీవుడ్ స్టార్ హీరో, చాక్లెట్‌ బాయ్‌ రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాకు తనవైపు నుండి ఎలాంటి అభ్యంతరాలు లేవని గంగూలీ ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతానికి నిర్మాణసంస్థ కొందరు రైటర్స్ ద్వారా ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ వరకు సిద్ధం చేస్తుండగా ప్రస్తుతానికి దర్శకుడు ఎవరన్నది ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమాలో గంగూలీ యువకుడి దగ్గర నుండి తన క్రికెట్ ప్రస్థానం, లార్డ్స్‌లో అతను సాధించిన చారిత్రక విజయంతో పాటు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేవరకు ప్రధాన ఘట్టాలన్నీ తెరకెక్కనున్నాయట. ఇక, మాజీ హీరోయిన్ నగ్మాతో ప్రేమాయణం, బ్రేకప్ సన్నివేశాలు కూడా ఇందులో ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదైనా నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చి.. దర్శకుడిని ప్రకటిస్తే కానీ ఈ ప్రాజెక్టుపై పూర్తిస్పష్టత వచ్చే అవకాశం లేదు.