Gopichand : హీరోగా ఫస్ట్ సినిమా పోయినప్పుడు అందరూ చాలా మాటలు అన్నారు.. సినిమాల్లోకి వచ్చి తప్పుచేశా అనిపించింది..

గోపీచంద్ మొదట హీరోగా చేసిన సినిమా పోవడంతో విలన్ గా మారి, ఆ తర్వాత హీరోగా మళ్ళీ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బాలకృష్ణ అడగడంతో గోపీచంద్ మాట్లాడుతూ........

Gopichand : హీరోగా ఫస్ట్ సినిమా పోయినప్పుడు అందరూ చాలా మాటలు అన్నారు.. సినిమాల్లోకి వచ్చి తప్పుచేశా అనిపించింది..

Gopichand shares about his movies

Gopichand :  బాలకృష్ణ యాంకర్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో ఎంతో గ్రాండ్ సక్సెస్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే రెండో సీజన్ లో కూడా ఏడు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ వచ్చి అలరించాడు. ఈ ఎపిసోడ్ కి భారీ స్పందన వచ్చింది. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు దేశవ్యాప్తంగా ఈ షోని చూశారు. ప్రభాస్ ఎపిసోడ్ తో ఆహా ఓటీటీకి బాగా రీచ్ వచ్చింది. అయితే ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా టెలికాస్ట్ చేయాలనుకున్నారు.

ఏడో ఎపిసోడ్ లో కేవలం ప్రభాస్ తో నడిపించి ఎనిమిదో ఎపిసోడ్ లో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, హీరో గోపీచంద్ ని కూడా తీసుకొచ్చారు. వీరి కాంబినేషన్ ఎపిసోడ్ నేడు జనవరి 6 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ కూడా ప్రేక్షకుల్లో బాగా రీచ్ అవుతుంది. ఎనిమిదో ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి ప్రభాస్, గోపీచంద్ రచ్చ రచ్చ చేశారు. ఎపిసోడ్ ఆద్యంతం నవ్వించారు, అలరించారు, ఎన్నో గుర్తుండిపోయే మూమెంట్స్ ని ప్రేక్షకులకి అందించారు.

Prabhas : ప్రభాస్ కి యాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనిపించిందో తెలుసా?

గోపీచంద్ మొదట హీరోగా చేసిన సినిమా పోవడంతో విలన్ గా మారి, ఆ తర్వాత హీరోగా మళ్ళీ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బాలకృష్ణ అడగడంతో గోపీచంద్ మాట్లాడుతూ.. నాన్న చిన్నప్పుడే చనిపోయారు, అన్నయ్య కూడా ఆ తర్వాత చనిపోయారు. నేను సినిమాల్లోకి వస్తా అన్నప్పుడు అమ్మ మొదట భయపడింది, కానీ తర్వాత ఒప్పుకుంది. మొదటి సినిమా హీరోగా చేసింది ప్లాప్ అవ్వడంతో ఒక 8 నెలలు ఖాళీగా ఉన్నా. ఏం చేయాలో తెలీదు, ఎవర్ని అడగాలో తెలీదు, ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడేవారు, చాలామంది అనేకరకాల మాటలు అన్నారు. అప్పుడు తప్పుచేశానేమో అనిపించింది, సినీ పరిశ్రమ వదిలేద్దాం అనుకున్నా. కానీ పోయిన చోటే వెతుక్కోవాలి అనుకున్నా. అప్పుడే జయం సినిమా ఆఫర్ వచ్చింది విలన్ గా. ఏదైతే అది అయింది ముందు మనం యాక్టింగ్ లో ప్రూవ్ చేసుకోవాలి అని విలన్ గా ఆ మూడు సినిమాలు చేశాను. విలన్ గా చేసిన ఆ మూడు సినిమాలు నా కెరీర్ కి మంచి బేస్ మెంట్ వేశాయి. ఆ తర్వాత హీరోగా మళ్ళీ సినిమాలు చేసానంటే ఆ సినిమాలే కారణం అని తెలిపాడు.