Hansika Motwani : పెళ్లి అయినా సినిమాలకి గ్యాప్ ఇచ్చేది లేదు.. 7 సినిమాలతో హన్సిక!

యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. కాగా పెళ్లి తరువాత ఈ భామ సినిమాలకు దూరంగా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. అయితే ఈ విషయంపై యాపిల్ బ్యూటీ హన్సిక క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినిమాలు గురించి మాట్లాడుతూ..

Hansika Motwani : పెళ్లి అయినా సినిమాలకి గ్యాప్ ఇచ్చేది లేదు.. 7 సినిమాలతో హన్సిక!

Hansika Motwani

Hansika Motwani : యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్ లో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటిస్తూ వరుడిని అభిమానులకు పరిచయం చేసింది. తన స్నేహితుడు మరియు బిజినెస్ పార్టనర్ అయిన సోహెల్ ని ప్రేమించి పెళ్లాడింది హన్సిక. డిసెంబర్ 4న రాజస్థాన్‌ జైపూర్‌లోని ముండోటా ప్యాలెస్‌ లో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే ఈ వెడ్డింగ్ కి కేవలం ఇరువురి కుటుంబ సభ్యులు మరియు అతి సన్నిహితులైన బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు.

Hansika Motwani: అభిమానుల మీద అంత ప్రేమ ఉంటే.. యూట్యూబ్‌లో అప్లోడ్ చేయవచ్చుగా.. స్టార్ హీరోయిన్స్‌పై అభిమానుల సెటైర్లు..

కాగా పెళ్లి తరువాత ఈ భామ సినిమాలకు దూరంగా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. అయితే ఈ విషయంపై యాపిల్ బ్యూటీ హన్సిక క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినిమాలు గురించి మాట్లాడుతూ.. ‘పెళ్లి తరవాత సినిమాలకు దూరం అయ్యే ఉద్దేశం లేదు. పెళ్లి పనులు వలన కొంచెం గ్యాప్ తీసుకున్నాను అంతే. ఇటీవలే ఒక కమర్షియల్ యాడ్ లో నటించాను. ఇక ఈ నెల 20 నుంచి సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాను. ప్రస్తుతం నా చేతిలో 7 సినిమాలు ఉన్నాయి. అలాగే 2 వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను’ అంటూ తెలియజేసింది.

కాగా వీటిలో రెండు తెలుగు సినిమాలు, మిగతివి తమిళ సినిమాలు. ఇక వెబ్ సిరీస్ విషయానికి వస్తే తెలుగులో ‘నషా’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. తమిళంలో ‘మైత్రి’ అనే సిరీస్ లో నటిస్తుంది. ఇక హన్సిక సేవ కార్యక్రమాలు గురించి ప్రశ్నించగా.. ప్రస్తుతం 30 మంది అనాధ పిల్లలని దత్తత తీసుకున్నట్లు వెల్లడించింది. ఇటీవల సంక్రాంతి పండుగని కూడా వారి తోనే కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. వారందరి కొత్త బట్టలు ఇచ్చినప్పుడు వారి కళ్ళలో సంతోషం చూసి నేను పొందిన ఆనందం మాటల్లో చెప్పలేను అని చెప్పుకొచ్చింది.