Dhanush : హ్యాపీ బర్త్‌డే ‘ఇళయ సూపర్‌స్టార్’..

‘అసురన్’, ‘కర్ణన్’, ‘జగమేతంత్రం’ సినిమాలతో తనలోని పర్ఫార్మర్‌ని పీక్స్‌లో చూపించిన ధనుష్ ‘మారన్’ తో మరోసారి ప్రేక్షకాభిమానులను అలరించడం పక్కా అంటున్నారు మూవీ టీం..

Dhanush : హ్యాపీ బర్త్‌డే ‘ఇళయ సూపర్‌స్టార్’..

Dhanush

Dhanush: కెరీర్ స్టార్టింగ్ నుండి స్టోరీ సెలక్షన్ పరంగా కొత్తదనం చూపిస్తూ, డిఫరెంట్ అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్లు చేస్తూ కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో వెర్సటైల్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, చిన్న వయసులోనే నాలుగు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న నటుడిగా సెన్సేషన్ క్రియేట్ చేశారు ‘ఇళయ సూపర్‌స్టార్’ ధనుష్..

Dhanush

 

బుధవారం(జూలై 28) ధనుష్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. శేఖర్ కమ్ముల సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు ధనుష్. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మేకర్స్ ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ‘ఇళయ సూపర్‌స్టార్’ అని సంబోధించడం విశేషం.

Dhanush : శేఖర్ కమ్ముల గారితో పని చేసేందుకు ఎగ్జైటెడ్‌గా ఉన్నా – ధనుష్..

ధనుష్, మాళవికా మోహనన్ జంటగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. ధనుష్ హీరోగా నటిస్తున్న 43వ సినిమా ఇది. ఈ మూవీకి ‘మారన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ వదిలారు. డిఫరెంట్ గెటప్‌లో ధనుష్ లుక్ ఆకట్టుకుంటోంది. ‘అసురన్’, ‘కర్ణన్’, ‘జగమేతంత్రం’ సినిమాలతో తనలోని పర్ఫార్మర్‌ని పీక్స్‌లో చూపించిన ధనుష్ ‘మారన్’ తో మరోసారి ప్రేక్షకాభిమానులను అలరించడం పక్కా అంటున్నారు మూవీ టీం.

Dhanush